Heart: 30ల్లో గుండె ఆరోగ్యం ఎలా?
వయసు 30 సంవత్సరాలు వచ్చాయంటే ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన శ్రద్ధ ఇంకాస్త పెంచాలని అర్థం. ఇప్పుడున్న జీవన శైలిలోని మార్పులు, వాతావరణ మార్పులు, తీసుకునే ఆహారం కారణంగా ఒకప్పుడు 40 ఏళ్లు దాటితే వచ్చే అనారోగ్య సమస్యలు ఇప్పుడు 30 రాగానే మొదలవుతున్నాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యం (heart)ఎంతో కీలకం. 30 ఏళ్లు వచ్చిన వారు గుండెను ఎలా పదిలంగా ఉంచుకోవాలో ఇందుకోసం ఎలాంటి అలవాట్లు అలవర్చుకోవాలో తెలుసుకుందాం. (heart health)
*మీ BMI ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. మీ BMI మీ వయసు వెయిట్ హైట్‌కి సమానంగా ఉండాలి.
*గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం అత్యంత కీలకం. వ్యాయామం చేసేటప్పుడు మన గుండె కొట్టుకోవడంలో కాస్త వేగం పెరుగుతుంది. అంటే గుండె కండరాలు కూడా ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. వ్యాయామం అలవాటు లేకపోతే మొద్దు బారిపోయి గుండె కండరాలు బిగుసుకుపోయి సమస్యలు వస్తాయి. ఇప్పటివరకు వ్యాయామం అలవాటు లేకపోతే ఇక నుంచి చేసుకోవడం బెటర్.
*29 ఏళ్ల వరకు ఏదో ఆడుతూ పాడుతూ ఏది పడితే అది తింటూ ఎంజాయ్ చేసారు. ఇక చాలు. 30 ఏళ్లు పడ్డాయంటే ఇక ప్రతి సంవత్సరానికి ఒక సారి హార్ట్ చెకప్ చేయించుకోవడం ఎంతో మంచిది. (heart)
*ఏం తింటున్నారో కూడా చూసుకోవడం ఎంతో ముఖ్యం. ఇప్పటివరకు తిన్నది వేరే.. ఇక నుంచి తినబోయే లెక్క వేరు. మీ డైట్‌లో పొట్టు తీయని ఆహారం ఎక్కువగా ఉండేలా చూసుకోండి.
*ఒత్తిడిని దరిచేరనివ్వకండి. ఒత్తిడికి గురయ్య పనుల జోలికి వెళ్లకండి. దీని వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగి స్ట్రోక్స్ వచ్చే సమస్యలు వస్తాయి.
*స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లు ఉంటే వెంటనే మానేయడం బెటర్. మీరు ఎంత వ్యాయామం చేసినా ఎంత మంచి ఆహారం తీసుకుంటున్నా స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లు ఉంటే ఏమీ చేయలేం. (heart)
*యోగా, మెడిటేషన్ అలవాటు చేసుకోండి. ఇవి ఒత్తిడిని దూరం చేస్తాయి.