Sunflower Seeds: రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం..!
పొద్దుతిరుగుడు పువ్వు (sunflower seeds) నుంచి తీసే విత్తనాలు ఎంత రుచికరంగా ఉంటాయో అంతే ఆరోగ్యంగా ఉంటాయి. దీనిని వలిచి తింటేనే రుచి. కానీ చాలా మందికి దానిని ఎలా తినాలో తెలీక అసలు తినడమే మానేస్తుంటారు. అందుకే ఇప్పుడు ఇవి రెడీ టు ఈట్‌గా మార్కెట్లలో సులువుగా లభిస్తున్నాయి. పొద్దుతిరుగుడు విత్తనాలను తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం.
ఇమ్యూనిటీని పెంచుతుంది
విటమిన్ ఈ, జింక్ ఈ విత్తనాల్లో ఎక్కువగా ఉంటాయి. అందుకే ఒక కప్పు విత్తనాలు తింటే ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటారు.
కొవ్వును తగ్గిస్తుంది
వీటిలో పీచు పదార్థం ఎక్కువ కాబట్టి బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కూడా ఇట్టే కరిగించేస్తుంది. వీటిలో ఉండే విటమిన్ బి3, నియాసిన్ గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడతాయి. (sunflower seeds)
బ్రెస్ట్ క్యాన్సర్‌ను నివారిస్తుంది
పొద్దుతిరుగుడు విత్తనాల్లో బీటా సైటోస్టెరాల్ అనే ఒక కొవ్వు పదార్థం బ్రెస్ట్ క్యాన్సర్లు రాకుండా కాపాడుతుందట. ఒకవేళ వచ్చినా కూడా ట్యూమర్ సైజ్ పెరగకుండా ఆపుతుందట.
బరువు తగ్గిస్తుంది
బరువు తగ్గాలనుకునేవారికి ఇది అమృతంలాంటి ఫుడ్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ విత్తనాల్లో ప్రొటీన్, ఫైబర్ ఎక్కువ. ఎప్పుడైతే ఈ రెండూ అధికంగా ఉండే ఆహారాన్ని మనం తీసుకుంటామో ఆకలి నెమ్మదిస్తుంది. అప్పుడు ఓవర్‌గా తినేయకుండా ఉంటాం. ఫలితంగా బరువూ పెరగరు. (sunflower seeds)
ఎనీమియా దరిచేరదు
ఐరన్ లోపం ఉంటే వెంటనే ఈ విత్తనాలు తినడం ప్రారంభించండి. ఒక వారంలోనే మీకు తేడా తెలిసిపోతుంది.