Vastu: అద్దం ఎక్క‌డ ఉంటే మంచిది?

వాస్తు ప్రకారం ఇంట్లో అద్దాన్ని పెట్టుకోవ‌డం ఎంతో ముఖ్యం అని అంటున్నారు నిపుణులు (vastu). పెట్ట‌కూడ‌ని ప్ర‌దేశాల్లో అద్దాల‌ను (mirror) అమ‌రిస్తే లేని పోని స‌మ‌స్య‌లు వస్తాయ‌ట‌. ఎప్పుడూ కూడా రెండు అద్దాల‌ను ఎదురెదురుగా ఉంచ‌కూడ‌ద‌ట‌. దీని వ‌ల్ల ఇల్లంతా నెగిటివ్ ఎన‌ర్జీతో నిండిపోతుంది. ఎప్పుడూ కూడా అద్దం నేల‌కు 4 నుంచి 5 అడుగుల ఎత్తులో ఉండాల‌ట‌. ఇక అద్దాల షేప్ విష‌యానికొస్తే.. స్క్వేర్ (చ‌తుర‌స్ర ఆకారం) లేదా రెక్టాంగిల్ (దీర్ఘ చ‌తుర‌స్ర ఆకారం)ల‌లో ఉండాలి. అందంగా ఉంటాయి క‌దా అని ఓవ‌ల్ (అండాకారం) రౌండ్ షేపుల్లో ఉన్న‌వి తీసుకోకండి. అద్దం సైజు విష‌యంలో మాత్రం ఎంత ఉండాల‌నే నియ‌మాలు ఏమీ లేవు. (vastu)

ఇంటి ముందు చెట్లు ఉండి చూడ‌టానికి వ్యూ బాగుంటే మీ ఇంటి ముందే ఓ అద్దాన్ని పెట్టండి. అద్దంలో క‌నిపించే అంద‌మైన ప్ర‌తిబింబాలు ఎంతో మంచివి. ఒక‌వేళ మీ ఇంట్లోని వ‌స్తువుని చూడ‌గానే మీకు ఏదైనా నెగిటివ్ వైబ్స్ వస్తుంటే దాని ముందు ఓ అద్దం ఉంచండి. అద్దం నెగిటివిటీని లాగేస్తుంది. డైనింగ్ రూంలో ఒక అద్దం పెట్టుకున్నా మంచిదే. ఆరోగ్యం బాగుంటుంది. తిండికి బ‌ట్ట‌కు లోటు ఉండ‌దు అని చెప్తుంటారు. ఇక ఎక్కువ‌గా అద్దం బెడ్ రూంల‌లో పెట్టుకుంటాం కాబ‌ట్టి నైరుతి మూల‌లో కానీ ద‌క్షిణ దిశ‌లో కానీ పెట్టుకుంటే మంచిది. మీ అద్దం ఎప్పుడూ వెలుగు ఉన్న చోట ఉంచాలి. చీకటి ప్ర‌దేశాల్లో పెట్టుకోకూడ‌దు. ఒక‌వేళ బాత్రూమ్‌లో అద్దం ఉంటే.. తూర్పు లేదా ఉత్త‌రాన పెట్టుకోండి. ( vastu)