Menopause: మెనోపాజ్ సమయంలో ఇవి తప్పకుండా తినాల్సిందే
Menopause: మెనోపాజ్ సమయంలో మహిళలు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. రుతుక్రమం ఆగిపోయిందంటే.. రకరకాల రోగాలు మొదలవుతాయని అర్థం. అంతకుముందు వరకు ఎలాంటి ఆహారాలు తీసుకున్నా.. మెనోపాజ్ సమయంలో పోషకాహారం తీసుకోవడం మొదలుపెట్టాల్సిందే.
మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంటుంది. అందుకే బయటి నుంచి ఈ ఈస్ట్రోజెన్‌ను ఉత్పత్తి చేయాలి. ఇందుకోసం సోయా బీన్స్, సోయా పాలు వంటివి తీసుకుంటూ ఉండాలి.
మెనోపాజ్ సమయంలో శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ వస్తుంది. అప్పుడే గుండె సంబంధిత సమస్యలు మొదలవుతాయి. అందుకే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే చేపలు ఎక్కువగా తీసుకోవాలి.
ఆకుకూరల వినియోగాన్ని పెంచండి. పాలకూర, చుక్కకూర వంటలను బాగా తినండి. ఎలాంటి ఆకుకూరైనా మంచిదే.
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి బెర్రీ జాతికి చెందిన పండ్లు వారంలో రెండు సార్లైనా తీసుకునేందుకు ప్రయత్నించండి. దీనివల్ల ఆక్సిడేటివ్ ఒత్తిడి, ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతాయి.
బాదం, అవిసెగింజెలు, వాల్నట్స్, సబ్జా గింజెలు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. ఓట్స్, కీన్వా, దంపుడు బియ్యంలో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇవి రోజూ తీసుకుంటే మంచిది.
మెనోపాజ్ సమయంలో ఎముకల్లో బలం తగ్గిపోతుంటుంది. అందుకే కాల్షియం ఎక్కువగా తీసుకోవాలి. పాలు, పెరుగు, వెన్నలో కావాల్సినంత కాల్షియం ఉంటుంది.