మొటిమ‌లా? మెంతుల‌తో ఇలా చేసి చూడండి

మెంతుల్లో బోలెడు ఔషధ గుణాలు ఉంటాయి. మెంతులు వంటకాల రుచిని పెంచడంతోపాటు మధుమేహాన్ని నియంత్రించగలవు. అలాగే ఇవి మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించగలవు. చర్మం, జుట్టు ఆరోగ్యానికి మెంతులు ఎంతో మేలు చేస్తాయి. ప్రోటీన్, కొవ్వులు, కార్బోహైడ్రేట్, కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, సి, కె, బి, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం, రాగి, జింక్, ఫైబర్ తదితర పోషకాలు మెంతుల‌లో సమృద్ధిగా లభిస్తాయి. మెంతుల వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
మెంతి ఆకలి, జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే తల్లుల బ్రేస్ట్స్ నుంచి పాల స్రావం (secretion) సక్రమంగా జరిగేలా దోహదపడుతుంది. మహిళల్లో పాల ఉత్పత్తి పెరగడానికి కూడా మెంతులు సహాయపడతాయి.
మెంతులు లేదా మెంతికూర తరచుగా తినడం వల్ల మధుమేహం నియంత్రణలోకి వస్తుంది. అందుకే షుగర్ కంట్రోల్ కోసం పరగడుపున కొన్ని మెంతులు తినాలని వైద్యులు కూడా సూచిస్తుంటారు. మెంతులు కొలెస్ట్రాల్ తగ్గించడంతోపాటు రక్తపోటును మెరుగుపరుస్తుంది.
ఇది జుట్టు రాలడం, నెరిసిన జుట్టు, యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించి గౌట్ సమస్యను పరిష్కరించడంలో సాయపడుతుంది. ఇది బ్లడ్ లెవెల్స్ మెరుగుపరిచి రక్తహీనత సమస్యను తొలగిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడానికి (డిటాక్సిఫై) కూడా సహాయపడుతుంది.
న్యూరల్జియా(నరాలవ్యాధి), పక్షవాతం, మలబద్ధకం, కడుపు నొప్పి, ఉబ్బరం తగ్గించడంలో మెంతి దివ్యౌషధంగా పనిచేస్తుంది. వెన్నునొప్పి, మోకాలి కీళ్ల నొప్పులు, కండరాల తిమ్మిరి, శరీరంలోని ఏ భాగంలోనైనా నొప్పిని నయం చేయడంలో మెంతులు బాగా ఉపయోగపడతాయి.
ఇది దగ్గు, ఉబ్బసం, బ్రాంకైటిస్ ఊపిరితిత్తుల్లో ద్రవాలు, శ్లేష్మం గడ్డ కట్టడం, ఊబకాయం వంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
క్రమం తప్పకుండా మెంతుల పొడిని తీసుకుంటే ఎన్నో రకాల వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. మెంతికూరలో పోషక విలువలతోపాటు విటమిన్లు, మినరల్స్, ఖనిజ లవణాలు ఉండటంతో మెంతులను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
అందానికీ..
మెంతులను పేస్ట్ లా చేసి.. అందులో పెరుగుగానీ, కలబంద గుజ్జు కానీ కలపాలి. అవి అందుబాటులో లేకపోతే నీటిని కూడా కలపచ్చు. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేయడం వల్ల చుండ్రు, జుట్టు రాలడం, నెరిసిన జుట్టు వంటి సమస్యలు మటుమాయమవుతాయి.
రోజ్‌వాటర్‌తో తయారు చేసిన మెంతికూర పేస్ట్‌ని ముఖంపై సున్నితంగా మర్దన చేయడం వల్ల డార్క్ సర్కిల్స్, మొటిమలు, మొటిమల మచ్చలు, ముడతలు తొలగిపోతాయి.