Apples: యాపిల్ పండ్లు ఎలా తింటే మంచిది?
Apples: రోజుకో యాపిల్ పండు తింటే వైద్యుడి వద్దకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు అంటారు. అంత మంచివి యాపిల్స్ ఆరోగ్యానికి. అయితే చాలా మందికి ఈ యాపిల్ పండు విషయంలో ఓ డౌట్ ఉంటుంది. అదేంటంటే.. యాపిల్ పండుని తొక్క తీసి తినాలా? తొక్కతో సహా తినాలా? కట్ చేసి తినాలా? అని. ఈ సందేహాలపై నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం.
మీకు ఒకవేళ మలబద్ధకం సమస్య ఉన్నట్లైతే యాపిల్ పండు తొక్క తీయకుండా తినాలి. ఒకవేళ విరోచనాల సమస్య ఉంటే అప్పుడు తొక్క తీసి తినాలట. ఇది వింటే వింతగా అనిపిస్తుంది కానీ.. జీర్ణకోశ సమస్యలు ఉంటే యాపిల్స్‌ని కాస్త ఉడకబెట్టి తింటే మంచిదని అంటున్నారు. యాపిల్ పండు తొక్కలో ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. అందుకే తొక్కతో సహా తింటే కడుపులో పేరుకుపోయిన మలాన్ని తేలికగా బయటికి పంపించేస్తుంది. ఫలితంగా నెమ్మదిగా మలబద్ధక సమస్యలు తగ్గుతాయి.
యాపిల్ పండ్లను ఉడకబెట్టినప్పుడు ఇందులోని పెక్టిన్ అనే సాల్యుబుల్ పీచు పదార్థం విడుదల అవుతుంది. ఇది బెస్ట్ ప్రోబయోటిక్. దీని వల్ల జీర్ణ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి.