Belly Fat: నిద్రలోనే పొట్ట కరిగిపోద్ది..!
Belly Fat: నిద్రలోనే పొట్ట కరిగించుకోవచ్చా? ఈ డ్రింక్స్ తాగితే తప్పకుండా కరిగించుకోవచ్చని అంటున్నారు నిపుణులు. పొట్టలో కొవ్వు పేరుకుపోవడానికి ఎంత సమయం పడుతుందో.. ఆ వేలాడే పొట్టను తగ్గించుకునేందుకు అంతకంటే రెట్టింపు సమయమే పడుతుంది. కాబట్టి వేగంగా ఫలితాలు రావాలి అని సర్జరీలు చేయించుకోవడం మంచి పద్ధతి కాదు. అలాంటి సర్జరీలు ఉచితంగా చేస్తాం.. డిస్కౌంట్ ఇస్తాం అనే వారి మాటలను అస్సలు నమ్మకండి.
ఇకపోతే.. వేలాడే పొట్ట తగ్గేందుకు ఉదయం పూట జిమ్, వ్యాయామాలు చేస్తుండాలి. అలాగే కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉంటూ ఇంట్లో చేసిన ఆహారాన్ని అప్పటికప్పుడు తింటుండాలి. ఇక నిద్రపోయే సమయంలో మన బాడీ రిలాక్సింగ్ పొజిషన్లో ఉంటుంది. ఆ సమయంలో ఈ జ్యూస్ తాగితే మనకు హాయిగా నిద్రపట్టడంతో పాటు వేలాడే పొట్ట కూడా కరుగుతుంది. ఇంతకీ ఆ జ్యూస్ ఏంటంటే.. అజ్వైన్ డ్రింక్.
అజ్వైన్ డ్రింక్కి కావాల్సిన పదార్థాలు
అజ్వైన్ (వాము) – 1 టేబుల్ స్పూన్
పసుపు – అర చెంచా
సోంపు గించెలు – 1 టేబుల్ స్పూన్
ధనియాలు – 1 టేబుల్ స్పూన్
ఒక గ్లాసులో నీళ్లు
తయారుచేసుకునే విధానం
అజ్వైన్, పసుపు, ధనియాలు, సోంపు గింజెలను ఒక గ్లాసు నీటిలో వేయండి. ఆ మిశ్రమాన్ని 20 నిమిషాల పాటు మరిగించండి. ఆ తర్వాత దానిని వడగట్టి నిద్రపోయే ముందు తాగండి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తుంటే పొట్టకు పొట్ట తగ్గుతుంది.. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.