బోండం నుంచి కొబ్బరి నీళ్లు తాగి కోమాలో వృద్ధుడు
Coconut Water: ఓ వ్యక్తి కొబ్బరి బోండం నుంచి నేరుగా నీళ్లు తాగి ఇప్పుడు కోమాలో ఉన్నాడు. ఈ ఘటన డెన్మార్క్‌లో చోటుచేసుకుంది. దాంతో కొబ్బరి బోండం నుంచి నేరుగా నీళ్లు తాగాలా వద్దా అనే అంశంపై డిబేట్ మొదలైంది. ఈ అంశంపై ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అతను ఆల్రెడీ బొక్క పెట్టి ఉన్న కొబ్బరి బోండం నుంచి నీళ్లు తాగడంతో అవయవాల పనితీరు ఆగిపోయి కోమాలో ఉన్నాడు. పైగా అతని వయసు 69. ఆల్రెడీ తెరిచి ఉన్న బోండం నుంచి నీళ్లు తాగడం మంచిది కాదు. బయట ఎక్కడైనా ఆగి కొబ్బరి నీళ్లు తాగాలనుకున్నా కూడా.. బోండం కొట్టి ఇచ్చాక లోపల కొబ్బరి ఎలా ఉందో చూడండి. తెల్లగా ఉంటే అది తాజాగానే ఉందని అర్థం. అలా కాకుండా కాస్త కుళ్లినట్లు వాసన వస్తుంటే దానిని వెంటనే పడేయటం మంచిది.