Harbhajan Singh: రుతు.. ఇక ధోనీ చేత ఆడించ‌కు!

Harbhajan Singh says ms dhoni should stop playing now

Harbhajan Singh:  మాజీ క్రికెట‌ర్ హ‌ర్భ‌జన్ సింగ్.. ఇక ధోనీ (MS Dhoni) ఆడ‌టం మానుకోవాల‌ని అంటున్నారు. ముందు ముందు జ‌ర‌గ‌బోయే చెన్నై సూప‌ర్ కింగ్స్ (Chennai super Kings) మ్యాచ్‌ల‌లో ధోనీని ఆడ‌కుండా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) అడ్డుకోవాల‌ని డిమాండ్ చేసారు. నిన్న జరిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో ధోనీ 9వ పొజిష‌న్ నుంచి ఆడ‌టంపై అంద‌రూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. 9వ స్థానం నుంచి ఆడ‌ట‌మే కాకుండా డ‌క‌వుట్ అవ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లోనే చెన్నై సూప‌ర్ కింగ్స్ వికెట్లు కోల్పోతున్నా ధోనీ 9వ స్థానంలో ఆడ‌టం ఏంటి అని హ‌ర్భ‌జ‌న్ ప్ర‌శ్నించారు. ముందు ముందు గేమ్స్‌లో ధోనీ ఇలాగే ఆల‌స్యంగా వ‌చ్చి ఆడాల‌నుకుంటే ఇక ధోనీ ఆడ‌క‌పోవ‌డ‌మే మంచిది అని షాకింగ్ కామెంట్స్ చేసారు.

“” ఒక‌వేళ ధోనీ 9వ స్థానంలో ఆడాల‌నుకుంటే.. బ్యాటింగ్ కాకుండా ఆయ‌న బౌలింగ్ ఎంచుకోవ‌డం మంచిది. టీంలో డిసిష‌న్ మేక‌ర్ అయివుండి 9వ స్థానంలో ఆడి టీం స్పిరిట్‌ను దెబ్బ‌తీస్తున్నాడు. నాకు తెలిసి ధోనీని 9వ స్థానంలో ఆడ‌మ‌ని కెప్టెన్ రుతురాజ్ చెప్పి ఉండ‌డు. అది ధోనీ సొంత నిర్ణ‌యం అయివుంటుంది “” అని మండిప‌డ్డారు.