Allu Arjun కాంగ్రెస్ కోసం ప్ర‌చారం చేస్తున్నారా?

is allu arjun campaigning for congress

Allu Arjun:  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి సంబంధించిన ఓ ఫోటో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌న న్యూయార్క్‌లో కాంగ్రెస్ పార్టీకి ప్ర‌చారం చేస్తున్నట్లుగా ఆ ఫోటో క‌నిపిస్తోంది. మెడ‌లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కండువా వేసుకుని మైక్‌లో ఏదో చెప్తున్న‌ట్లుగా ఉన్న వీడియో కూడా స‌ర్క్యులేట్ అవుతోంది. దాంతో చాలా మంది నెటిజ‌న్లు వీడియోలోని స్క్రీన్ షాట్స్ తీసి అల్లు అర్జున్ కాంగ్రెస్ త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తున్నారంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఆ త‌ర్వాత తెలిసిందేంటంటే.. అది ఇప్ప‌టి వీడియో కాద‌ని 2022లో న్యూయార్క్‌లో నిర్వ‌హించిన ఇండియా డే ప‌రేడ్‌లో బ‌న్నీ త‌న భార్య అల్లు స్నేహారెడ్డితో క‌లిసి పాల్గొన్నారని తెలిసింది.