Met Gala: అంత‌ర్జాతీయ వేదిక‌పై అన్నీ క‌నిపించేలా..!

Met Gala: అమెరికాలో ఏటా జ‌రిగే మెట్ గాలా వేడుక ఈ ఏడాది కూడా అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. ఈ వేడుక‌లో ఈసారి బాలీవుడ్ న‌టి ఆలియా భ‌ట్, రిల‌య‌న్స్ సంస్థ‌ల బోర్డ్ ఆఫ్ డైరెక్ట‌ర్స్ ఇషా అంబానీ కూడా పాల్గొని త‌మ డ్రెస్సుల‌తో ఔరా అనిపించారు. అయితే ఈ వేదిక‌పై అమెరిక‌న్ సింగ‌ర్ డోజా క్యాట్ వేసుకొచ్చిన డ్రెస్ గురించే ఇప్పుడు అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. లోప‌ల ఏమీ వేసుకోకుండా.. ఓ ఆఫ్ వైట్ ట‌వ‌ల్ లాంటి డ్రెస్సును నీటిలో త‌డిపి దానిని వేసుకుని నేరుగా వేదిక‌పైకి వ‌చ్చేసారు. దాంతో ఆమె ప్రైవ‌ట్ భాగాలు ఎక్స్‌పోజ్ అవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఏడుస్తున్న‌ట్లుగా క‌ళ్లకు కాటుక పెట్టుకుని విచిత్రంగా త‌యారై వ‌చ్చారు. దాంతో ఇప్పుడ డోజా క్యాట్ వైర‌ల్‌గా మారారు.