Curd: పెరుగులో చెక్కర మంచిదా? ఉప్పు మంచిదా?
Curd: కొందరు పెరుగన్నంలో ఉప్పు వేసుకుని తింటారు. మరికొందరు పెరుగులో చెక్కర వేసుకుని తినేస్తుంటారు. అసలు పెరుగులో ఉప్పు వేసుకుని తింటే మంచిదా? లేక చెక్కర వేసుకోవాలా?
పెరుగులో ఉప్పు వేసుకుని తింటే ఎక్కువ కేలొరీలు శరీరంలో చేరవు. అదే చెక్కర వేసుకుంటే కేలొరీలు ఎక్కువగా ఉంటాయి.
డయాబెటిస్ ఉన్నవారు పెరుగులో ఉప్పు వేసుకుని తినడం మంచిది. అలాగని పెరుగు అన్నం తిన్న ప్రతీసారి ఉప్పు వేసుకోకూడదు. రక్తపోటు వస్తుంది.
బరువు తగ్గాలనుకునేవారు పెరుగులో బెల్లం వేసుకుని తింటే బెటర్. చెక్కర ఎక్కువగా తింటే ఇన్సులిన్ సమస్యలు, మెటబాలిజం సమస్యలు వస్తాయి
పెరుగులో ప్రోబయెటిక్స్, ప్రొటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. అందులో చెక్కర, ఉప్పు వేసుకుని లేనిపోని సమస్యలు తెచ్చుకోవడం ఎందుకు?