Relationship: లోపం మ‌నలోనూ ఉందేమో..!

Relationship: ప్రేమ విష‌యంలో రెడ్ ఫ్లాగ్స్, గ్రీన్ ఫ్లాగ్స్ అని వినే ఉంటారు. రెడ్ ఫ్లాగ్ అంటే.. మీ పార్ట్‌న‌ర్ నుంచి నెగిటివ్ వైబ్స్ రావ‌డం. గ్రీన్ ఫ్లాగ్స్ అంటే పార్ట్‌న‌ర్‌లో మీరు కోరుకున్న‌వ‌న్నీ ఉండ‌టం. అయితే ఈ రెడ్ ఫ్లాగ్స్ అనేవి ఎప్పుడూ పార్ట్‌న‌ర్‌లో వెత‌క‌డ‌మే కాదు.. మ‌న‌లో మనం కూడా ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకుంటూ ఉండాల‌ని అంటున్నారు రిలేష‌న్‌షిప్ సైకాల‌జిస్ట్‌లు.

ఉదాహ‌ర‌ణ‌కు.. మీ పార్ట్‌న‌ర్ మీతో ఎలా ఉండాల‌ని అనుకుంటున్నారో ఆలోచిస్తుంటారు. త‌ను అలా ఉంటే బాగుంటుంది.. ఇలా ప్రేమ చూపిస్తే బాగుంటుంద‌ని మీ కోరిక‌లు మీకుంటాయి. మ‌రి మీరు కూడా మీ పార్ట్‌న‌ర్‌తో ఇలాగే ఉంటున్నారా? లేదా మొత్తం బాధ్య‌త‌ను వారిపైనే వేస్తున్నారా? ఇది అతిపెద్ద రెడ్ ఫ్లాగ్. మీ పార్ట్‌న‌ర్ నుంచి మీరు ఏదైనా కోరుకుంటున్నారో అది మీ నుంచి కూడా వారు ఆశిస్తారు.

మీ పార్ట్‌న‌ర్ మీరు చెప్పిన‌వి శ్ర‌ద్ధ‌గా వింటున్నారా? మ‌రి వారు చెప్పేది మీరూ శ్ర‌ద్ధగా వింటున్నారా? ఎప్పుడూ మీరు చెప్పేదే వినాలంటే అవ్వ‌దు క‌దా..! మీ పార్ట్‌న‌ర్ చెప్పేది మీకు న‌చ్చ‌క‌పోయినా అస‌లు ఏం చెప్పాల‌నుకుంటున్నారో ఓపిగ్గా వినే అవ‌కాశం ఇవ్వండి. అవ‌స‌రం లేదు అనుకుని అరుచుకుంటూ గ‌దిలోకి వెళ్లి త‌లుపులు వేసుకోవడం వంటివి అస్స‌లు చేయ‌ద్దు. (relationship)

ఏదైనా స‌మ‌స్య వ‌స్తే మీ పార్ట్‌న‌రే చూసుకుంటారులే అని వారిపైనే మొత్తం భారం వేసేయ‌కండి. ఏం జ‌రిగినా ఇద్ద‌రు క‌లిసి చూసుకుందాం అన్న భావ‌న ఉంటేనే రిలేష‌న్‌షిప్‌లో ఉండాలి. లేదంటే జీవితాలు నాశ‌న‌మ‌వుతాయి. మీరు భావోద్వేగాల‌ను కంట్రోల్ చేసుకోలేక మీ పార్ట్‌న‌ర్‌పై అరిచేయ‌డం.. వారిని తిట్ట‌డం వంటివి చేస్తున్నారా? ఇది కూడా రెడ్ ఫ్లాగ్‌ల‌లో ఒక‌టి. కోపంగా ఉన్నా చిరాగ్గా ఉన్నా బాధ‌లో ఉన్నా మ‌నం మాట్లాడే విధానం త‌ప్పుగా అస్స‌లు ఉండ‌కూడ‌దు. ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు బేబీ, బుజ్జీ అని పిలిచి.. మూడ్ బాలేన‌ప్పుడు అన‌కూడ‌ని మాట‌లు అనేస్తే అది బంధ‌మే కాదు అనే విష‌యం గుర్తుంచుకోండి.