Sleep: నోరు తెరిచి నిద్ర.. చాలా డేంజర్
Sleep: చాలా మంది నిద్రలో నోరు తెరుచుకుని పడుకుంటూ ఉంటారు. దీనిని మౌత్ బ్రీతింగ్ అంటారు. అంటే సాధారణంగా ముక్కుతో కాకుండా నోటితో శ్వాస తీసుకోవడం. ఇలా నిద్రపోవడం చాలా డేంజర్ అని అంటున్నారు నిపుణులు. జలుబు చేసినప్పుడు ముక్కు రంధ్రాలు మూసుకుపోయినట్లు ఉంటాయి కాబట్టి నోటితో శ్వాస తీసుకుంటాం. వ్యాయామం చేస్తున్న సమయంలోనూ నోటితోనే శ్వాస తీసుకుంటారు. ఈ రెండిటి విషయంలో నోటితో శ్వాస తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్య లేదు. కానీ నిద్రపోతున్నప్పుడు నోటితో శ్వాస తీసుకోవడం మంచిది కాదట.
ఎలాంటి సమస్యలు వస్తాయి?
గురక అలవాటవుతుంది
నోటి దుర్వాసన పెరుగుతుంది
నోరు ఎండిపోతుంది
గొంతు మారుతుంది
నిద్రలేచాక చిరాగ్గా ఉంటుంది
తల దిమ్ముగా ఉంటుంది
కళ్ల కింద నల్లటి వలయాలు వస్తాయి
ముక్కులో పాలిప్స్ వంటివి పెరగడం.. టాన్సిల్స్ ఉండటం, ఒత్తిడి కారణంగా నోటి ద్వారా శ్వాస తీసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు లోపల ఏదన్నా ట్యూమర్ వంటిది ఉన్నా ముక్కు ద్వారా శ్వాస తీసుకోలేక నోరు తెరిచి పడుకుంటూ ఉంటారు. మీకు ఇలాంటి సమస్య ఉంటే ఒకసారి వైద్యులను సంప్రదించడం మంచిది