సెన్స్ సీన్ వల్ల నాకు దద్దుర్లు వచ్చాయి.. హీరోయిన్ ఆవేదన
Shruti Sharma: బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి (Heeramandi) వెబ్ సిరీస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ వెబ్ సిరీస్‌లో సీనియర్ హీరోయిన్లు శృంగారభరితమైన సన్నివేశాల్లో నటించడం గురించే ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. అయితే ఈ సెక్స్ సీన్లో నటించడం వల్ల తనకు దద్దుర్లు వచ్చాయని అంటున్నారు బాలీవుడ్ నటి శృతి శర్మ.
ఈ వెబ్సిరీస్లోని ఓ శృంగారభరితమైన సన్నివేశం ఉందని.. ఒక రోజంతా ఆ సన్నివేశాన్ని షూట్ చేసామని తెలిపింది. దాని వల్ల మరుసటి రోజు ఒళ్లంతా దద్దుర్లు వచ్చాయని.. కానీ సీన్ బాగా వచ్చినందుకు మాత్రం ఆనందంగా ఉందని తెలిపింది. ఈ సన్నివేశంలో తాను నేలపై దొర్లుతూ ఉండాలని.. దాని వల్ల నేలపై ఉన్న దుమ్ము వల్ల తనకు ర్యాషెస్ వచ్చాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సన్నివేశంలో నటించడం ఎందుకు మళ్లీ సమస్యలు వచ్చాయని ఏడవటం ఎందుకు అని ఎగతాళి చేస్తున్నారు.