Heeramandi: మ‌నీషా కోయిరాలాతో ఓర‌ల్ సెక్స్ సీన్.. ఎంటీ ద‌రిద్రం?

Heeramandi actor shekhar suman talks about oral sex with manisha koirala

Heeramandi: బాలీవుడ్ ద‌ర్శకుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కించిన ప్ర‌తిష్ఠాత్మ‌కమైన వెబ్‌సిరీస్ హీరామండి. మ‌నీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావు హైద‌రి వంటి స్టార్ న‌టీన‌టులతో చాలా గ్రాండ్‌గా ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించారు. పాకిస్థాన్‌కు స్వాతంత్రం రావ‌డానికి ముందు పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఉన్న హీరామండి అనే వేశ్య‌వాటికలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెరపై అద్భుతంగా చూపించారు. ఇది వేశ్య‌ల‌కు సంబంధించిన వెబ్ సిరీస్ కావ‌డంతో కొన్ని అస‌భ్య‌క‌ర‌మైన స‌న్నివేశాలు కూడా ఉంటాయి.

అయితే.. ఈ వెబ్‌సిరీస్‌లో మ‌నీషా కోయిరాలా.. శేఖ‌ర్ సుమ‌న్‌ల మ‌ధ్య ఓ శృంగార‌భ‌రిత‌మైన స‌న్నివేశం ఉంది. శేఖ‌ర్ సుమ‌న్.. మ‌నీషా కోయిరాలాతో ఓరల్ సెక్స్ చేస్తున్న‌ట్లు చూపించారు. ఇలాంటి సన్నివేశాల‌ను చూపించ‌డ‌మే త‌ప్పు అంటుంటే.. దీని గురించి శేఖ‌ర్ సుమన్ మీడియా ముందు గొప్ప‌గా చెప్పుకోవడం గ‌మ‌నార్హం. ఒక్క టేక్‌లోనే ఆ స‌న్నివేశాన్ని తెర‌కెక్కించామ‌ని అందుకు సంజ‌య్ కూడా మెచ్చుకున్నార‌ని తెలిపారు.

ఈ సినిమాలో శేఖ‌ర్ సుమన్ న‌వాబ్ జుల్ఫిక‌ర్ అనే పాత్ర‌లో న‌టించారు. ప‌ల్ల‌కిలో మ‌నీషా కోయిరాలా వెళ్తుండ‌గా.. తాగున్న శేఖ‌ర్ సుమ‌న్ అదే ప‌ల్ల‌కి ఎక్కుతాడు. తాగిన మైకంలో ఆమెతో శృంగారం చేయాల‌నుకుంటాడు. అయితే ఆ మైకంలో మ‌నీషా ఎక్క‌డ కూర్చుందో తెలీక గాల్లో శృంగారం స‌న్నివేశంలో న‌టించాడు. ఇలాంటి సన్నివేశాన్ని ఇప్ప‌టివ‌ర‌కు ఎవ్వ‌రూ చేసి ఉండ‌ర‌ని.. న‌చ్చ‌కపోతే చూడ‌కండి అని శేఖ‌ర్ మీడియా ద్వారా వెల్ల‌డించారు.