OG పోస్ట్‌పోన్.. దేవర ప్రీపోన్..!
Devara: కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా రెండు భాగాల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. తొలి భాగం షూటింగ్ ఇంకో నెల రోజుల్లో పూర్తైపోతుంది. సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు దేవర టీం ఆల్రెడీ ప్రకటించేసింది. కానీ ఇప్పుడు కాస్త ముందే రిలీజ్ చేసేయాలని అనుకుంటున్నారట. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా రిలీజ్ డేట్ రోజున దేవరను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఓజీ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది.
కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయ పరంగా బిజీగా ఉండటంతో ఓజీని సెప్టెంబర్ 27న రిలీజ్ చేసే అవకాశాలు లేవని నిర్మాత డివివి దానయ్య అనుకుంటున్నారట. కాబట్టి ఓజీ రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉంది. ఆ తేదీన దేవర సినిమా రిలీజ్ అవుతుందని టాలీవుడ్ టాక్.