వేసవి కావడంతో పుచ్చకాయ తెగ తినేస్తున్నారా? జాగ్రత్త!
Watermelon: వేసవి కావడంతో ఎండలు మండిపోతున్నాయి. ఈకాలంలో ఎక్కువగా చవకగా దొరికే పండు పుచ్చకాయ. అలాగని పుచ్చకాయను ఈ వేసవిలో ఎక్కువగా తినేస్తున్నారా? అయితే ఈ అంశాల గురించి మీకు తెలుసుకోవాలి.
పుచ్చకాయలో 98% నీరు ఉంటుంది. దీంతో పాటు విటమిన్ A, B6, C, B1, B5, B9 కూడా ఉంటాయి. అలాగని ఎక్కువగా తినేస్తే విరోచనాలు పట్టుకుంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే పుచ్చకాయలో ఫ్రక్టోస్ వంటి నేచురల్ చెక్కర ఉంటుంది. ఇది ఎక్కువగా తీసుకుంటే విరోచనాలు పట్టుకుంటాయి.
బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా రిస్క్
వెంట వెంటనే పుచ్చకాయ ముక్కలను తినేడయం వల్ల బ్లోటింగ్, గ్యాస్ ఫామ్ అవుతాయి.
ఒంట్లోని ఎలక్ట్రోలైట్లు బ్యాలెన్స్ తప్పుతాయి.
ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి మితంగా తింటే మంచిదని వైద్యులు చెప్తున్నారు.