Suicide: “అత‌ని కోసం మ‌తం మార్చుకోవాల‌నుకున్నా”

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో (uttar pradesh) ఓ యువ‌తి లెట‌ర్ రాసి ఆత్మ‌హ‌త్య (suicide) చేసుకున్న ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. పింకీ అనే యువ‌తి ఓ జిమ్ సెంట‌ర్‌లో రిసెప్ష‌నిస్ట్‌గా ప‌నిచేస్తుండేది. ఈమెకు స‌కీబ్ అనే జిమ్ ట్రైన‌ర్‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మారింది. అయితే కొంత‌కాలంగా సకీబ్ పెళ్లి చేసుకోవాల‌ని టార్చ‌ర్ చేస్తుంటే.. ఇప్పుడు కాదు కొన్నేళ్లు ఆగి చేసుకుందాం అని ఆపుతూ వ‌చ్చింది. ఈ మ‌ధ్య‌లో స‌కీబ్‌కి ఆల్రెడీ వివాహం అయింద‌ని పింకీకి తెలిసింది.

దాంతో ఆమె ఎంతో బాధ‌పడింది. పెళ్లి కాలేదు అని చెప్పి మోసం చేసాడ‌న్న బాధ‌తో సూసైడ్ లెట‌ర్ రాసి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఆ లెట‌ర్‌లో ఇలా రాసి ఉంది. “” స‌కీబ్‌ను ఎంతో ప్రేమించాను. అత‌న్ని పెళ్లి చేసుకోవాల‌ని మ‌తం కూడా మార్చుకోవాలని అనుకున్నాను. చాలా మంది వ‌ద్దు అని చెప్పినా నేను ప‌ట్టించుకోలేదు. ఎలాగైనా స‌కీబ్ నావాడు కావాల‌నుకున్నాను. కానీ అత‌నికి ఆల్రెడీ పెళ్ల‌యింది. ఇదంతా తెలిసాక నేను త‌ట్టుకోలేక‌పోతున్నాను. నా చావుకు స‌కీబే కార‌ణం “” అని రాసి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దాంతో పోలీసులు స‌కీబ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. (suicide)