గత నెలలో ప్రమోషన్.. ఈ నెలలో లే ఆఫ్!
Tesla: ఏడేళ్లుగా పనిచేస్తున్న ఓ ఉద్యోగికి టెస్లా షాకిచ్చింది. గత నెలలో ప్రమోషన్ ఇచ్చి.. ఈ నెలలో ఉద్యోగం నుంచి తీసేసింది. ఎలాన్ మస్క్ కంపెనీలో టెకీగా పనిచేస్తున్న ఓ యువతికి ఈ ఘటన ఎదురైంది. దాంతో ఆ యువతి సోదరుడు జతిన్ సైనీ లింక్డిన్లో ఈ విషయాన్ని వెల్లడిస్తూ కంపెనీల కోసం కష్టపడి పనిచేస్తే ఇలాగే ఉంటుంది అని వెల్లడించారు. జతిన్ సోదరి టెస్లాలో దాదాపు ఏడేళ్లుగా పనిచేస్తోంది. ఆమె పనితీరుకి మెచ్చి గత నెలలో ప్రమోషన్ కూడా ఇచ్చారు. కానీ మొన్న శుక్రవారం అదే కంపెనీ నుంచి మమ్మల్ని తీసేస్తున్నాం అని మెయిల్ పంపించారు. సైనీ చెల్లెలు మాత్రమే కాదు.. ఏప్రిల్ 15న టెస్లా దాదాపు 16 వేల మంది ఉద్యోగులను తీసేసింది. 15 రోజుల తర్వాత మరో 500 మందిని తొలగించింది. సేల్స్ విషయంలో టెస్లాకు నష్టాలు రావడంతో కంపెనీలోని దాదాపు 10 శాతం మందిని తొలగించేసింది.