Hyderabad: సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణ హత్య
Hyderabad: హైదరాబాద్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. మధురానగర్‌లో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన నివాసంలో హత్యకు గురయ్యాడు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంకి చెందిన రవికుమార్ అనే యువకుడు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను భార్య, కూతురితో కలిసి మధురానగర్‌లో నివసిస్తున్నాడు.
నిన్న సాయంత్రం రవికుమార్ భార్య తన కూతురిని తీసుకుని దగ్గర్లోని పార్క్‌కి వెళ్లి తిరిగి రాగా.. రవి కుమార్ విగతజీవిగా పడున్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఘటనా స్థలికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. దుండగుడు టోపీ, మాస్క్ పెట్టుకుని రవి కుమార్ ఇంట్లోకి చొరబడినట్లు కనిపిస్తోంది. కళ్లలో కారం చల్లి రాడ్డుతో దాడి చేసి చంపినట్లు తెలుస్తోంది. రవికుమార్ చనిపోయాక అతనిపై పసుపు, కారం చల్లి నిందితుడు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.