News Click జర్నలిస్ట్‌లపై యాంటీ టెర్రర్ కేసులు
ఢిల్లీకి చెందిన ప్రముఖ మీడియా సంస్థ న్యూస్ క్లిక్‌లో (news click) పనిచేస్తున్న పలువురు జర్నలిస్ట్‌లపై పోలీసులు రైడ్లు నిర్వహించారు. వీరు దేశ ద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని ఇందుకోసం చైనా నుంచి ఫండింగ్ లభిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలువురు జర్నలిస్ట్‌లపై యాంటీ టెర్రర్ లా కింద కేసులు నమోదు చేసారు. న్యూస్ క్లిక్ భారత్‌లో చైనా ప్రాపగండాను వ్యాప్తిచేస్తోందని ఇందుకు గానూ డ్రాగన్ దేశం నుంచి కోట్లల్లో ఫండ్స్ తీసుకుంటోందని ముందు న్యూయార్క్ టైమ్స్ బయటపెట్టింది.
కేసులైతే నమోదు చేసారు కానీ ఇప్పటివరకు కేవలం పలువురు జర్నలిస్ట్‌లను స్టేషన్‌కు పిలిపించి విచారణ మాత్రమే చేపట్టారు. ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదు. గతంలో కూడా న్యూస్ క్లిక్ సంస్థకు చైనా నుంచి రూ.38 కోట్లు ముట్టాయని ఈడీ తెలిపింది. ఈ న్యూస్ క్లిక్ సంస్థకు ఫండింగ్ ఇచ్చే నెట్‌వర్క్ అమెరికాకు చెందిన మిలియనేర్ నెలీవ్ రాయ్ సింగంకు చెందినది.