Viral News: కుర్‌కురే తేలేద‌ని విడాకులు కోరిన భార్య‌

woman seeks divorce over kurkure packet

Viral News: రూ.5 కుర్‌కురే ప్యాకెట్ తేలేద‌ని ఓ మ‌హిళ విడాకులు కావాలంటూ రోడ్డుకెక్కింది. ఈ విచిత్ర ఘ‌ట‌న ఆగ్రాలో చోటుచేసుకుంది. ఆగ్రాకు చెందిన ఓ మ‌హిళ రోజూ కుర్‌కురే తిన‌డం అల‌వాటుగా మార్చుకుంది. అది లేకుండా అన్నం కూడా తిన‌డం లేదు. రోజూ వ‌ద్దు అని భ‌ర్త ఎంత చెప్తున్నా వినేది కాదు. అయితే నిన్న ప‌నిలో ప‌డి భ‌ర్త కుర్‌కురే తీసుకెళ్ల‌డం మ‌ర్చిపోయాడు. దాంతో ఆ మ‌హిళ నానా హంగామా చేసింది. ఇరుగు పొరుగు వారికి వినిపించేలా కుర్‌కురే కావాలంటూ కేక‌లు వేసింది. భ‌ర్త‌కు కూడా కోపం రావ‌డంతో ఏం చేసుకుంటావో చేసుకో అనేసాడు. దాంతో విడాకులు కావాలంటూ రోడ్డుకెక్కింది. దాంతో పోలీసులు వారిని కౌన్సిలింగ్‌కు పంపించారు. న‌లుగురిలో త‌న ప‌రువు తీసేసింది అంటూ పాపం ఆ భ‌ర్త పోలీసుల ముందు వాపోయాడు.