Viral News: కాలితో ఓటేసిన వ్య‌క్తి..!

man votes with his leg

Viral News: త‌న ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌డానికి అంగ వైక‌ల్యం ఏమాత్రం అడ్డుకాద‌ని నిరూపించారు ఓ వ్య‌క్తి. ప్ర‌మాదంలో రెండు చేతుల‌ను కోల్పోయిన‌ప్ప‌టికీ కాలితో త‌న ఓటు హ‌క్కును వినియోగించుకుని న‌లుగురికీ స్ఫూర్తిగా నిలిచాడు. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్‌లో చోటుచేసుకుంది. న‌దియాడ్ ప్రాంతానికి చెందిన అంకిత్ సోనీ అనే వ్యక్తి 20 ఏళ్ల క్రితం క‌రెంట్ షాక్ కొట్టి త‌న రెండు చేతులూ కోల్పోయాడు. త‌న టీచ‌ర్లు, గురువుల సాయంతో డిగ్రీ కూడా పూర్తి చేసాడు. నిన్న అత‌ను త‌న నోటితో ఓట‌ర్ కార్డు ప‌ట్టుకుని ఓటు వేసేందుకు రావ‌డంతో అక్క‌డున్న‌వారంతా ఆశ్చ‌ర్య‌పోయారు. త‌న కాలిపై సిరా గుర్తు వేయాల‌ని చెప్ప‌డంతో అక్క‌డి పోలింగ్ బూత్ అధికారులు కూడా ఒప్పుకున్నారు