NBK 109: రిపీట్..!

kajal agarwal to pair up with balakrishna in nbk 109 again

NBK 109: నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు NBK 109 అనే వ‌ర్కింగ్ టైటిల్ పెట్టారు. అయితే ఇందులో హీరోయిన్ విష‌యంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మ‌రోసారి భ‌గ‌వంత్ కేసరి కాంబినేష‌న్ రిపీట్ కాబోతోందని తెలుస్తోంది. అంటే.. ఈ సినిమాలో కూడా బాల‌య్య‌కు జంట‌గా కాజ‌ల్ అగ‌ర్వాలే (Kajal Agarwal) న‌టించ‌బోతోంద‌న్న‌మాట‌. అయితే ఇందులో కాజ‌ల్ రొటీన్ హీరోయిన్ క్యారెక్ట‌ర్‌లో న‌టించ‌డంలేద‌ట‌. కాజ‌ల్ పాత్ర‌లో నెగిటివ్ షేడ్స్ ఉంటాయ‌ని తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ న‌టి ఊర్వశి రౌతెల పోలీస్ అధికారి పాత్ర‌లో న‌టించ‌బోతోంది. బాలీవుడ్ న‌టుడు బాబీ డియోల్ విల‌న్ పాత్ర‌లో ఫిక్స్ అయ్యారు.