బావమరిది పెళ్లిలో భార్య డ్యాన్స్.. ఆత్మహత్య చేసుకున్న భర్త
Viral News: సోదరుడి పెళ్లిలో సంతోషంగా డ్యాన్స్ చేసింది ఓ మహిళ. అది తట్టుకోలేక ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విచిత్ర ఘటన బిహార్లో చోటుచేసుకుంది. బధారియా ప్రాంతానికి చెందిన గోపాల్ ప్రతాప్ అనే వ్యక్తి.. సోదరుడి పెళ్లిలో డ్యాన్స్ చేయొద్దు అని భార్యకు చెప్పాడు. ఇందుకు ఆమె ఒప్పుకోలేదు. తన సోదరుడి పెళ్లిలో తాను కాకపోతే ఇంకెవరు డ్యాన్స్ చేస్తారు అని వాదించింది. ఎంత చెప్పినా వినకుండా నలుగురి ముందు ఇష్టమొచ్చినట్లు డ్యాన్స్ చేయడంతో తట్టుకోలేకపోయిన గోపాల్ రైలు పట్టాల మీదకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గోపాల్ చిన్నప్పటి నుంచి ఇంతే అని.. అతనికి నచ్చని పనిని ఎవరైనా చేస్తే భరించేవాడు కాదని.. కానీ ఇలా ప్రాణాలు తీసుకుంటాడని అనుకోలేదని అతని కుటుంబీకులు పోలీసులకు తెలిపారు.