Hyderabad: వేరొకరితో ప్రియురాలి ముచ్చట్లు.. ఉరేసుకున్న ప్రియుడు
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ పరమ రెడ్డి హిల్స్‌లో నివసిస్తున్న ఐటీ ఉద్యోగి ఇమ్రోస్ పటేల్(28) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ప్రియురాలు అనుష్క తనని మోసం చేసి మరో అబ్బాయితో చనువుగా ఉంటూ తనను పట్టించుకోవటం లేదని మనస్థాపానికి గురై ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.