సెక్స్ పేరుతో కవ్వించి.. చంపేసి.. పాతిపెట్టి.. టీచర్ మాస్టర్ ప్లాన్!
Viral News: ఓ టీచర్ తన ప్రియుడిని సెక్స్ పేరుతో కవ్వించి అతన్ని దారుణంగా చంపేసింది. ఈ ఘటన ఇంగ్లాండ్‌లో జరిగింది. నార్త్హ్యాంప్టన్షైర్కి చెందిన ఫియోనా అనే ప్రైమరీ స్కూల్ టీచర్ తన బాయ్‌ఫ్రెండ్ నికోలాస్ను చంపేయాలని ప్లాన్ వేసింది. ఇందుకోసం నెల రోజుల నుంచే ప్లాన్ వేసింది.
నికోలాస్ను సెక్స్ పేరుతో ఇంటికి పిలిపించింది. దాంతో అతను ఫియోనా మాటలు నమ్మి ఆమె ఇంటికి వెళ్లాడు. బెడ్రూంలోకి తీసుకెళ్లి కాళ్లు చేతులు కళ్లు కట్టేసింది. ఇది కూడా సెక్స్‌లో భాగమే అనుకున్నాడు నికోలాస్. దాంతో అతను అలా కట్టేస్తున్నా కూడా అతను ఏమీ అనలేదు. ఆ తర్వాత ఫియోనా ప్లాన్ ప్రకారం ముందే కొని పెట్టుకున్న కత్తితో అతని మెడపై దారుణంగా పొడిచి చంపేసింది. ఆ తర్వాత నికోలాస్ మృతదేహాన్ని తన ఇంటి వెనుక ఉన్న గార్డెన్లో తవ్వి పాతిపెట్టింది.
ఆ తర్వాత ఎవ్వరికీ అనుమానం రాకుండా నికోలాస్ ఫోన్ నుంచి అతని స్నేహితులు, కుటుంబీకులకు మెసేజ్‌లు పంపింది. తనకు నికోలాస్కు కోవిడ్ వచ్చిందని అందుకే కొంతకాలం పాటు బయటికి రావడం కుదరదని అందరినీ నమ్మించింది. అయితే నికోలాస్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్వయంగా మాట్లాడకపోవడం.. అతను అసలు బయట కనిపించకపోవడంతో కుటుంబీకులు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసారు. దాంతో పోలీసులు ఫియోనాపై అనుమానంతో ఆమె ఇంట్లో సోదాలు చేయగా.. గార్డెన్లో నికోలాస్ మృతదేహం లభించింది.