ఫెయిలైన బాధలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. బిడ్డ కోసం తండ్రి ఆత్మహత్య
Viral News: హన్మకొండ జిల్లా నడికూడ మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన గాజ కుమారస్వామికి(47) భార్య రమాదేవి, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. తన చిన్న కూతురు శ్రీవిద్య గతేడాది హనుమకొండలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదివి కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిలైంది.
ఇటీవల సప్లిమెంటరీ పరీక్షలు రాసినా పాస్ కాలేదు. దీంతో కుమారస్వామి శ్రీవిద్యని మందలించాడు. అసలే పరీక్షల్లో పాస్ కాకపోవడం, తండ్రి కోపగించుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీవిద్య ఇంట్లో ఉన్న పురుగులమందు తాగింది. ఆమెను వెంటనే పరకాల ఆస్పత్రికి తరలించారు. అయితే తన వల్లే కూతురు ఆత్మహత్యకు యత్నించిందని భావించిన కుమారస్వామి పరకాలలోని ఫెర్టిలైజర్ షాపులో పురుగుల మందు తీసుకుని కంఠాత్మకూర్ సమ్మక్క సారలమ్మ గద్దెల వైపు వెళ్లి మందు తాగి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర విషాదానికి లోనయ్యారు.