ఆ భారీకాయుడికి అంత్యక్రియలు కూడా నిర్వహించలేని పరిస్థితి
Viral News: ఏ తల్లికీ రాని కష్టం ఆమెకు వచ్చింది. కన్నకొడుకు చిన్న వయసులోనే చనిపోయాడు. బిడ్డకు నాలుగేళ్లు ఉన్నప్పుడే భర్త పోయాడు. ఇప్పుడు కొడుకూ లేడు. కొడుకు చనిపోయాడన్న బాధ కంటే అతని అంత్యక్రియలు నిర్వహించలేకపోతున్నానే అని ఆమె కన్నీరుమున్నీరవుతోంది. పై ఫోటోలో కనిపిస్తున్న యువకుడి పేరు జేసన్. ఇతను బ్రిటన్‌లోనే అత్యంత భారీకాయుడు. జేసన్‌కు నాలుగేళ్లు ఉన్నప్పుడే తండ్రిపోయాడు. ఆ బాధతో డిప్రెషన్లోకి వెళ్లిపోయి విపరీతంగా తినేసేవాడు. ఫలితంగా ఊబకాయం వచ్చింది. చిన్న పిల్లాడే కదా.. కొన్నేళ్లు గడిస్తే సర్దుకుంటుందిలే అని జేసన్ తల్లి కూడా పట్టించుకోలేదు. ఆమె చేసిన తప్పు వల్లే వారం రోజుల క్రితం జేసన్ అవయవాలు ఫెయిల్ అవడంతో చనిపోయాడు.
జేసన్ విపరీతంగా తినేస్తుండడాన్ని చూసి అతని తల్లి కూడా ఏమీ చేయలేకపోయింది. దాంతో అతను 300 కిలోల వరకు బరువు పెరిగిపోయి మంచానికే పరిమితం అయ్యాడు. ఇతనికి ఇప్పుడు 33 ఏళ్లు. ఇంకో వారంలో 34వ పుట్టినరోజు జరుపుకుంటాడు అనగా.. అవయవాల పనితీరు ఆగిపోయి చనిపోయాడు. అయితే జేసన్‌కు అంత్యక్రియలు ఎలా నిర్వహించాలా అని అతని తల్లి బాధపడుతోంది. ఎందుకంటే శవపేటికలో మృతదేహాన్ని పెట్టి పూడ్చి పెట్టాల్సి ఉంటుంది. జేసన్ మృతదేహం పట్టేంత శవపేటిక లభించకపోవడంతో బిడ్డ శవాన్ని ఓ హాస్పిటల్‌లోని మార్చురీలో పెట్టించింది.