బ్రిటన్ మహారాజు అంత్యక్రియలకు ప్లానింగ్!
King Charles: బ్రిటన్ మహారాజు చార్ల్స్ బతికుండగానే రాయల్ ప్యాలెస్ యంత్రాంగం ఆయన అంత్యక్రియలకు ప్లాన్లు వేసేస్తోంది. ఆపరేషన్ మెనాయ్ బ్రిడ్జ్ అనే పేరుతో ఈ అంత్యక్రియల పత్రాలను సిద్ధం చేసింది. ఈ పత్రాలను చార్ల్స్ సన్నిహితులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారట. ఈ ఏడాది ఫిబ్రవరిలో కింగ్ చార్ల్స్‌కు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఆయన చికిత్సకు బాగానే స్పందిస్తున్నారని బకింగ్‌హామ్ ప్యాలెస్ చెప్తోంది కానీ నిజానికి ఆయన ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోందని టాక్.
సాధారణంగా ఓ మనిషి చనిపోబోతున్నాడంటే విల్లుకు సంబంధించిన అంశాల గురించి చర్చించుకుంటారు కానీ బ్రిటన్ రాయల్ ప్యాలెస్‌లో మాత్రం ముందే అంత్యక్రియలకు సంబంధించిన పత్రాలు సిద్ధం చేస్తారు. రాజకుటుంబంలో మరణించే ప్రతి ఒక్కరికి ఓ కోడ్ నేమ్ ఉంటుంది. ఎలిజబెత్ మహారాణి చనిపోయినప్పుడు ఆమె సమాధికి ఆపరేషన్ లండన్ బ్రిడ్జ్ అని పేరు పెట్టారు.