Viral News: తనది మగ పుట్టుక అని తెలిసి వధువు షాక్..!
Viral News: ఇంకొన్ని గంటల్లో పెళ్లి. కోరుకున్న వ్యక్తితో కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్నా అన్న సంతోషం ఆ వధువుకి కొన్ని క్షణాలు కూడా మిగల్లేదు. సరిగ్గా పెళ్లికి ఇంకొన్ని గంటలు ఉందనగా.. ఆమె ఆడది కాదు మగాడు అని తెలిసి కుప్పకూలిపోయింది. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది.
హ్యబెయ్ రాష్ట్రానికి చెందిన లీ అనే 27 ఏళ్ల యువతి.. సాధారణంగా వయసు పెరిగే కొద్ది శరీరంలో రావాల్సిన మార్పులు రాలేదు. అంటే రొమ్ములు పెరగకపోవడం.. రుతుస్రావం కాకపోవడం వంటి సమస్యలు వచ్చాయి. అలాగని మగవారిలాగా తనకు గెడ్డం కూడా రాలేదు. దాంతో తనకు 18 ఏళ్లు వచ్చేసరికి ఒంట్లో పలు మార్పులు వచ్చాయి. దాంతో ఆమె వైద్యులను సంప్రదించింది. ఎందుకైనా మంచిదని వైద్యులు క్రోమోసోమ్ పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. కానీ లీ అంత అవసరం ఏముందిలే అని లైట్ తీసుకుంది.
ఈ నేపథ్యంలో ఆమె ఒక యువకుడితో ప్రేమలో పడింది. అయితే పెళ్లికి ముందు తనకున్న సందేహాలు తీర్చుకోవాలనుకుని వైద్యులు చెప్పినట్లుగా క్రోమోసోమ్ పరీక్షలు చేయించుకుంది. ఇందు కోసం కావాల్సిన సాంపుల్స్ అన్నీ ఇచ్చింది. ఇంకొన్ని గంటల్లో తాను ప్రేమించినవాడితో పెళ్లి జరగోబోతోంది అనగా.. లీకి రిపోర్టులు వచ్చాయి. ఆ రిపోర్టులో తాను అసలు అమ్మాయే కాదని.. అబ్బాయని తేలింది. దాంతో లీ కన్నీరుమున్నీరైంది.
దీనిని కోజెనిటల్ ఆడ్రిలిన్ హైపర్ ప్లాసియా డిజార్డర్ అంటారు. ఈ రుగ్మతతో బాధపడేవారు అమ్మాయిలాగే కనిపిస్తారు కానీ వారిది మాత్రం మగ పుట్టుక అయ్యి ఉంటుంది. అందుకే లీ కి మరో యువకుడిపై ప్రేమ పుట్టింది. 50,000 మంది శిశువుల్లో ఒకరికి ఈ రుగ్మత వచ్చే అవకాశం ఉందని చైనా డాక్టర్లు తెలిపారు. లీకి పురుషాంగం కడుపులో ఉన్నందున అది క్యాన్సర్కు దారి తీస్తుందని భయపడి తొలగించేసారు. ఇప్పుడు లీ మానసిక పరిస్థితి ఏమీ బాగోలేదు. పెళ్లిని రద్దు చేసుకుని ఒంటరిగా ఉంటూ బాధపడుతోందని ఆమె సన్నిహితులు మీడియాకు వెల్లడించారు.