Cricket: బాల్ మర్మాంగానికి తగిలి బాలుడి మృతి
Cricket: క్రికెట్ ఆడుతుండగా బాల్ మర్మాంగానికి తగలడంతో ఓ బాలుడు మైదానంలోనే మృతిచెందాడు. ఈ ఘటన పుణెలో చోటుచేసుకుంది. శౌర్య అనే 11 ఏళ్ల బాలుడు క్రికెట్ ఆడుతుండగా.. బౌలింగ్ వేసాడు. బ్యాట్స్‌మెన్ ఆ బాల్‌ను శౌర్య వైపే కొట్టడంతో అది అతని ప్రైవేట్ భాగానికి తగిలింది. దాంతో నొప్పితో విలవిలలాడుతూ కుప్పకూలిపోయాడు. అతని స్నేహితుడు ఎంత లేపినా లేవకపోవడంతో శౌర్య తల్లిదండ్రులను పిలిచారు. వారు వచ్చి తమ బిడ్డను హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.