Ambati Rambabu: నాగ‌బాబు గారూ.. మీ కూతురి విష‌యంలో ఏం జ‌రిగింది?

Ambati Rambabu slams pawan kalyan for using his son in law

Ambati Rambabu: త‌న అల్లుడిని రెచ్చ‌గొట్టి మ‌రీ త‌న‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేయిస్తున్నార‌ని మండిపడ్డారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత అంబ‌టి రాంబాబు. ఇటీవ‌ల ఆయ‌న అల్లుడు డాక్ట‌ర్ గుండ‌బోలు గౌత‌మ్ వీడియో ద్వారా త‌న మామ‌కు ఓటు వేయొద్ద‌ని ఆయ‌న లాంటి నిస్వార్ధ‌ప‌రుడు, మోస‌కారి మ‌రొక‌రు ఉండ‌ర‌ని షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు.

దీనిపై నిన్న జ‌న‌సేనాని ప‌వన్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. రాంబాబు.. నీ అల్లుడే నీకు ఓటు వేయ‌ద్దు అంటున్నాడు. దీనికేం చెప్తావ్ అని ప్ర‌శ్నించారు. దాంతో వెంట‌నే త‌న నియోజ‌క‌వ‌ర్గం అయిన స‌త్తెన‌ప‌ల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో అంబ‌టి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టారు.

“” నా కూతురికి అల్లుడికి మ‌ధ్య గొడ‌వ‌లు ఉన్నాయి. నాలుగేళ్లుగా వీరిద్ద‌రూ దూరంగా ఉంటున్నారు. నా అల్లుడి నుంచి కూతుర్ని, మ‌న‌వ‌రాలిని కాపాడుకుంటున్నాను. భ‌ర్త‌, తండ్రి లేక‌పోయినా నా కూతురు ధైర్యంగా బ‌తికేలా ఆమెను తీర్చిదిద్దుతున్నాను. నా బ‌ల‌హీన‌త‌ను వాడుకుని కూట‌మి నేత‌లు నా అల్లుడిని చేత అలాంటి వీడియో చేయించ‌డం బాధాక‌రం. చిరంజీవి గారూ.. మీ త‌మ్ముడికి చెప్పండి. మీ ఇంట్లో గొడ‌వ‌లు లేవా? నాగ‌బాబు గారూ.. మీ అమ్మాయి విష‌యంలో ఏం జ‌రిగింది? ఇది చాలా త‌ప్పు“”  అని మండిప‌డ్డారు.