Hyderabad: హ‌బ్సిగూడలో దారుణం

accident in habsiguda kills a school kid

Hyderabad: హైద‌రాబాద్‌లోని హ‌బ్సిగూడలో దారుణం చోటుచేసుకుంది. బస్సు వెనకాల ఆగి ఉన్న స్కూల్ పిల్లల ఆటోను వెనకాల నుండీ వ‌స్తున్న టిప్పర్ లారి ఢీకొట్టింది. దాంతో ఆటో ముందున్న ఆర్టీసీ బ‌స్సులోకి దూసుకెళ్లిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ఓ విద్యార్థిని మృతిచెందింది. బాలిక‌ తార్నాకలోని కిమితీ కాల‌నీకి చెందిన సాత్వికగా పోలీసులు గుర్తించారు. హబ్సిగూడలోని గౌతమ్ మోడల్ స్కూల్‌లో బాలిక‌ 10వ తరగతి చ‌దువుతోంది.