Hyderabad Rains: అకాల వర్షం.. అతలాకుతలం
Hyderabad Rains: అకాలవర్షంతో హైదరాబాద్ నగరం అతలాకుతలంగా మారింది. గోడ కూలి 7 మంది, నాలాలో కొట్టుకొని పోయి ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఇంత జరిగినా ముఖ్యమంత్రి, మంత్రులు, GHMC మేయర్ పత్తాలేరు. గంటలు గడిచినా కరెంట్ రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరో పక్క జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ముఖం చాటేసారు. నాలాలో కొట్టుకుపోయిన ఇద్దరు వ్యక్తుల శవాలు ఇలా కనిపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.