Varun Aaron: ధోనీకి రెండు సిక్సులు బాదేంత సీన్ లేదు
Varun Aaron: మాజీ క్రికెటర్ వరుణ్ ఆరోన్.. మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేసారు. 2010 ఐపీఎల్ సమయంలో జరిగిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని ఆరోన్ ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఆ సమయంలో ఇర్ఫాన్ పఠాన్ పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్నారు. ఆ సమయంలో పంజాబ్ కింగ్స్‌కి చెన్నై సూపర్ కింగ్స్‌కి మధ్య మ్యాచ్ జరుగుతోంది. క్వాలిఫైయర్స్‌లోకి వెళ్లాలంటే చెన్నై సూపర్ కింగ్స్ ఎలాగైనా మ్యాచ్ గెలవాల్సిందే.
ఆ సమయంలో ఇర్ఫాన్ బౌలింగ్ వేస్తుండగా.. ధోనీ బ్యాటింగ్ చేస్తున్నారు. ఇర్ఫాన్ వేసిన రెండు బంతుల్లో ధోనీ సిక్సులు బాదాడు. అలా తొలి ఐపీఎల్ టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకుంది. ఆ సమయంలో ధోనీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్ కూడా వరించింది. ఆ సమయంలో ఇర్ఫాన్ పఠాన్‌కి ఒంట్లో బాలేదట. అయినా కూడా బౌలింగ్ వేయాలని నిర్ణయించుకున్నాడు. ఇర్ఫాన్‌కి అనారోగ్య సమస్య లేకపోయి ఉంటే ధోనీ అతను వేసిన బౌలింగ్‌కి రెండు సిక్సులు వరుసగా బాదేంత సీన్ లేదని వరుణ్ ఆరోన్ ఆనాటి విషయాన్ని గుర్తుచేసుకున్నారు.