MS Dhoni: విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యులు.. ధోనీ మొండిపట్టు
MS Dhoni: నాలుగు పదుల వయసులోనూ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ అభిమానులను ఉత్తేజపరుస్తున్నారు మహేంద్ర సింగ్ ధోనీ. అయితే మొన్న జరిగిన పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో ధోనీ 9వ స్థానంలో ఆడటంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 9వ స్థానంలో బ్యాటింగ్ చేసే బదులు ధోనీ ఆడకపోవడమే మంచిదని.. ధోనీ చేత బ్యాటింగ్ చేయించకూడదని ఎందరో మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. చాలా మందికి తెలీని విషయం ఏంటంటే.. నిజానికి ధోనీని రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారట. కానీ ధోనీ వైద్యుల మాటలు లెక్క చేయకుండా మందులు వేసుకుని మరీ గేమ్ ఆడుతున్నారు.
ధోనీకి ఈ ఐపీఎల్ సీజన్ సమయంలోనే మోకాలి దగ్గర గాయం అయ్యింది. దాంతో రన్స్ ఎక్కువగా చేయలేకపోతున్నాడు. గాయం అయితే మానింది కానీ కండరం నొప్పి ఇంకా ఉందట. అందుకే ప్రాక్టీస్ చేసే సమయంలో కూడా బ్యాటింగ్‌పైనే ఫోకస్ చేస్తున్నాడు కానీ రన్స్ చేయడం లేదు. వైద్యులు రెస్ట్ తీసుకోమని చెప్తే ఇప్పుడు రెస్ట్ తీసుకోలేనని.. ఆడాల్సిందేనని అంటున్నాడట.