Mahasena Rajesh: ప‌వ‌న్‌ కంటే జ‌గ‌న్‌కి స‌పోర్ట్ చేయ‌డం బెట‌ర్

Mahasena Rajesh says it is better to support jagan than pawan kalyan

Mahasena Rajesh: జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి మ‌ద్ద‌తును ఉప‌సంహ‌క‌రించుకుంటున్న‌ట్లు తెలిపారు జ‌న‌సేన నేత మ‌హాసేన రాజేష్‌. రాజేష్‌కు టికెట్ ఇచ్చిన‌ప్ప‌టికీ అత‌నికి జ‌న‌సైనికుల నుంచి ఎలాంటి మ‌ద్ద‌తు లేక‌పోవ‌డంతో ఆయ‌న పార్టీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

“” ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పోలిస్తే జ‌గ‌న్‌కు స‌పోర్ట్ చేయ‌డం బెట‌ర్ అనిపిస్తోంది. ప‌వ‌న్, జగ‌న్ కంటే చంద్ర‌బాబు నాయుడుకు స‌పోర్ట్ చేస్తే ఇంకా మంచిది అనిపిస్తోంది. కుల మ‌తాల పేరుతో అమాయ‌కుల‌పై దాడి చేసేవారు ఎవ‌రైనా స‌రే వారికి వ్య‌తిరేకంగా పోరాడాల‌ని అంబేడ్క‌ర్ చెప్పారు. ప‌వ‌న్ వల్ల జ‌రిగే అన‌ర్థాల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తాం. ఇప్ప‌టికే చాలా స‌హించాం. జ‌న‌సేన పోటీ చేస్తున్న అన్ని స్థానాల్లో పార్టీ ఓడిపోయేలా రాజ్యాంగ బ‌ద్ధంగా ప‌నిచేస్తాం. మాకు రాజ‌కీయాలు, ప‌ద‌వులు ముఖ్యం కాదు. అన్యాయానికి గుర‌వుతున్న ప్ర‌జ‌ల త‌ర‌ఫున పోరాడ‌ట‌మే మాకు ముఖ్యం. ప‌దువులు అధికారం కావాల‌నుకుంటే జ‌గ‌న్‌తోనే ఉండేవాళ్లం. పైన ఉన్న నాయ‌కుల్లో నిల‌క‌డ లేన‌ప్పుడు మేం కూడా నిల‌క‌డ‌గా ఉండ‌లేం “” అని వెల్ల‌డించారు.