అమ్మ‌వారి ముఖాలు ఎందుకు కోపంగా ఉంటాయి?

Spiritual: చాలా మ‌టుకు అమ్మ‌వారి విగ్ర‌హాలు జిహ్వం బ‌య‌టికి ఉండి.. పెద్ద క‌ళ్ల‌తో కోపంగా చూస్తున్న‌ట్లు ఉంటాయి. అస‌లు అమ్మ‌వారి విగ్ర‌హాలు అలా ఎందుకు ఉంటాయో వెల్ల‌డించారు స‌ద్గురు జ‌గ్గీ వాసుదేవ్ (sadhguru)

అమ్మ‌వారు అంటే ఆదిప‌రాశ‌క్తి అనే విష‌యం మ‌న‌కు తెలిసిందే. మ‌న భార‌త‌దేశంలో స్త్రీని కూడా ఆదిప‌రాశ‌క్తిగానే చూస్తారు. అమ్మ‌వారి విగ్ర‌హాలు అంత కోపంగా ఉండ‌టానికి కార‌ణం స్త్రీ ఏ విష‌యానికీ త‌ల‌వంచ‌కుండా ధైర్యంగా ఎదుర్కోగ‌ల‌దు అని తెలియ‌జేస్తుంద‌ని అర్థం. ఈ ధైర్య‌మే ఒక స్త్రీ జీవితంలో త‌న‌కు కావాల్సిన‌వి ద‌క్కించుకునేలా చేస్తుంది. ఈ తెగింపే త‌నని తాను ఉన్న‌త శిఖ‌రాల‌కు తీసుకువెళ్లేందుకు దోహ‌ద‌పడుతుంది.

ఇంకొన్ని అమ్మ‌వారి విగ్ర‌హాలు చూసిన‌ట్లైతే అమ్మ ముఖం ఎంతో శాంతిమంతంగా ఉంటుంది. దీనికీ ఓ అర్థం ఉంద‌ని అంటున్నారు స‌ద్గురు. జీవితంలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ్వ‌రూ చెప్ప‌లేరు. కానీ ఏం జ‌రిగినా దానికి అనుగుణంగా న‌డుచుకోవాలి అని వివ‌రించేందుకే కొన్ని అమ్మ‌వారి ముఖాలు కోపంగా మ‌రికొన్ని ముఖాలు ప్ర‌శాంతంగా ఉన్న‌ట్లు క‌నిపిస్తాయ‌ట‌. (spiritual)