Vermillion: నుదుటిపై కుంకుమ పెట్టుకోవాల్సిందేనా?
Vermillion: పెళ్లైన ఆడవారి నుదట కుంకుమ తప్పకుండా ఉంటుంది. వివాహ సమయంలోనే నుదుటిపై భర్త చేత కుంకుమ పెట్టిస్తారు. ఇలా నుదుటిపై కుంకుమ పెట్టుకోకపోతే కొందరి కుటుంబాల్లో అశుభంగా భావిస్తారు కూడా. అసలు ఎందుకు ఈ నుదుటిపై కుంకుమకు అంత ప్రాధాన్యత ఉంది? సనాతన ధర్మంలో కుంకుమకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? వంటి విషయాలను తెలుసుకుందాం.
నుదుటిపై కుంకుమ పెట్టుకుంటే వారి వైవాహిక జీవితానికి ఎలాంటి ఢోకా ఉండదని పార్వతి దేవి ఆశీర్వదిస్తుందట. అలా కుంకుమ పెట్టుకోని వారిపై కంటే పెట్టుకునే వారిపైనే అమ్మ ఆశీస్సులు ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీని కూడా దూరం చేస్తుంది. మన హిందూ సంప్రదాయంలో పాటించే ప్రతి కార్యం వెనుక ఓ అర్థం పరమార్ధం ఉంటుంది. ఏ సంప్రదాయాన్ని కూడా పెద్దలు ఊరికే అలా పెట్టేయరు. కుంకుమను నిమ్మకాయ, పసుపుతో తయారుచేస్తారు. దానినే నుదుటపై పెట్టుకోవాలి. ఇప్పుడు మార్కెట్‌లో రకరకాల కెమికల్స్ కలిపిన కుంకుమలను అమ్మేస్తున్నారు. ఇలాంటివాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుంది.
పసుపు, నిమ్మరసాన్ని కలిపి తయారుచేసి పెట్టుకుంటే ఎంతో మంచిది. తల మధ్య భాగంలో కుంకుమ పెట్టుకుంటారు కాబట్టి అక్కడ ఉండే పిట్యూటరీ గ్రంథికి ఎంతో మంచిది. నుదుటపై కుంకుమను పెట్టుకుంటే బ్రెయిన్ అలెర్ట్‌గా ఉంటుందట. శరీరంలోని అన్ని చక్రాలు యాక్టివేట్ అవుతాయి. అంతేకాదు నుదుటిపై కుంకుమ పెట్టుకోవడం వల్ల జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అదృష్టం వరిస్తుంది.