Jobs: టెక్ జాబ్స్ కావాలా? ఈ యాప్స్ బెస్ట్!

Hyderabad: టెక్ జాబ్స్ (tech jobs) కావాలా? ఎలా వెత‌కాలో తెలీడంలేదా? ఈ ఐదు జాబ్ (jobs) యాప్స్ ద్వారా మీకు న‌చ్చిన టెక్ జాబ్‌ను సంపాదించుకుని అధిక సాల‌రీలు పొందండి.

లింక్డిన్ (linkedin)
ఈ మధ్య‌కాలంలో జాబ్స్ కోసం చాలా మంది ఇదే యాప్‌ని వాడుతున్నారు. ఒక్క జాబ్స్‌కే కాదు మీ నెట్‌వ‌ర్క్ పెంచుకోవ‌డానికి, స్కిల్స్ నేర్చుకోవ‌డానికి కూడా లింక్డిన్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఇండీడ్ (indeed)
జాబ్స్ మాత్ర‌మే కాదు చ‌క్క‌టి రెస్యూమ్స్ త‌యారుచేసి పెట్టడంలోనూ ఇండీడ్ ఎంతో ఉప‌యోగ‌పడుతుంది. అంతేకాదు.. ఏదైనా కంపెనీలో జాబ్‌కి అప్లై చేసేముందు ఆ కంపెనీ గురించి రివ్యూలు కూడా చెప్తుంది.

గ్లాస్ డోర్ (glass door)
ఇందులో మీరు రెస్యూమ్స్ అప్‌లోడ్ చేసేసి అందులో ఉండే జాబ్స్‌కి వెంట‌నే అప్లై చేసేసుకోవ‌చ్చు. ఇందులో మీకు ఆల్రెడీ ప‌నిచేస్తున్న ఎంప్లాయీస్, ఎక్స్ ఎంప్లాయీస్ నుంచి కావాల్సిన కంపెనీ గురించి రివ్యూలు కూడా తెలుసుకోవ‌చ్చు.

అప్‌వ‌ర్క్ (upwork)
ఫ్రీలాన్సింగ్ కావాల‌నుకుంటే అప్‌వ‌ర్క్ పోర్ట‌ల్ ది బెస్ట్. ల‌క్ష‌ల కొద్ది ఫ్రీలాన్సింగ్ జాబ్స్ ఇందులో ఉంటాయి. మీకు ఎలాంటి వాటిలో అనుభ‌వం ఉందో ఓ ప్రొఫైల్ క్రియేట్ చేసి పెట్టుకుంటే ఇతరులు మిమ్మ‌ల్ని సంప్ర‌దిస్తారు.

కెరీర్ బిల్డ‌ర్ (career builder)
మీకు ఎలాంటి ప్రొఫైల్ కావాలో దానికి త‌గ్గ ఇన్ఫ‌ర్మేష‌న్ ఇచ్చి రెస్యూమేలు క్రియేట్ చేసుకోవ‌డంలో కెరీర్ బిల్డ‌ర్ హెల్ప్ చేస్తుంది. కొత్త జాబ్ ఓపెనింగ్స్ ఉంటే మీకు అలెర్ట్స్ కూడా పంపుతుంది.