త్వరగా పెళ్లి అవ్వాలంటే ఈ వాస్తు టిప్స్ పాటించండి
కొందరికి జాతకంలో దోషం ఉండటం వల్ల పెళ్లిళ్లు (marriage) ఆలస్యం అవుతుంటాయి. మరికొందరికి వాస్తు సంబంధిత సమస్యల వల్ల పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోతుంటారు. మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లైతే.. ఈ వాస్తు టిప్స్ పాటించి చూడండి.
*వాస్తు శాస్త్రం ప్రకారం లైటు వేసుకుని కింద పడుకోకూడదట. అంతేకాదు.. పెళ్లికాని అమ్మాయిలు వాయువ్య దిశలో నిద్రపోవాలి. పెళ్లి కాని అబ్బాయిలు ఈశాన్యం వైపు పడుకోకూడదు.
*అంతేకాదు అమ్మాయిలు నైరుతి మూలలో నిద్రపోకూడదు. అబ్బాయిలు ఆగ్నేయం దిక్కున నిద్రపోకూడదు. (marriage)
*వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అద్దాలు ఎప్పుడూ పడమర, దక్షిణ దిశలో ఉండాలి. అవి నిద్రపోయే పరుపుల వైపు ఉండకూడదు.
*ఇంట్లోని గోడలకు డార్క్ రంగులు పూయకూడదు. లేత రంగులతోనే ఇంటి గోడలు ఉండాలి.
*మెట్ల వరుస ఇంటి మధ్యలో నుంచి నిర్మించి ఉండకూడదు. ఎర్రటి పూల మొక్కలను ఇంట్లో పెంచుకుంటే మంచిది.