Pink Salt: ఇలా వాడితే మంచిది

సాధారణంగా ఉప్పంటే సముద్రపు నీటి నుంచి తయారు చేస్తారని తెలుసు. కానీ మంచు నుంచి కూడా ఉప్పు తయారవుతుంది. అంతేకాదు ఈ ఉప్పు సాధారణ ఉప్పు కంటే ఎన్నో రెట్లు పోషకాలను కలిగి ఉంటుంది. హిమాలయాల్లో తయారయ్యే ఈ ఉప్పుని హిమాలయన్​ సాల్ట్​ అంటారు. హిమాలయన్​ సాల్ట్​లో చాలా రకాలు ఉంటాయి. వాటిలో ఒకటి పింక్​ సాల్ట్​. చూసేందుకు గులాబీ రంగులో ఉండటం వల్ల దీనికి పింక్​ సాల్ట్​ అని పేరొచ్చింది. ఈ ఉప్పు ప్రత్యేకత ఏంటంటే.. దీనిలో ఒకటీ, రెండు కాదు ఏకంగా 84 రకాల పోషకాలు ఉన్నాయట. అందుకే కాస్త ధర ఎక్కువైనా దీని వాడకం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. రాతి ఉప్పులా ఉండే దీనిని ఇండియాతోపాటు పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లోనూ ఉత్పత్తి చేస్తున్నారు. హిమాలయా పర్వతాల మొదట్లో ఉండే సహజ నిక్షేపాల నుంచి ఈ ఉప్పును తయారు చేస్తారు. సాధారణ ఉప్పులా కాకుండా.. ఇందులో సహజంగానే అయోడిన్ ఉంటుంది. ఇందులో ఉండే ఐరన్ ఆక్సైడ్ వల్ల ఈ ఉప్పు గులాబీ రంగులో ఉంటుంది. ఈ ఉప్పు వల్ల కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం..

* పింక్ సాల్ట్‌లో ఐరన్, జింక్, నికెల్, మాంగనీస్​తో పాటు చాలా రకాల పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి చాలా అవసరం. తక్కువ సోడియం ఉండటం వల్ల సాధారణ ఉప్పుతో పోలిస్తే పింక్ సాల్ట్ శరీరంలో సోడియం స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది. ఎందుకంటే సోడియం ఎక్కువైతే ఆరోగ్యానికి ప్రమాదకరం. ఎలక్ట్రోలైట్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మజిల్ క్రాంప్స్, నాడీ వ్యవస్థ పనితీరు మెరుగు పరచడంలో ఉపయోగపడుతుంది.
* పింక్​ సాల్ట్​లో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇంందులోని మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, జింక్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సముద్ర తీరాలు లేని ప్రాంతాల్లో ఉప్పు వినియోగం కోసం మంచు స్పటికాల నుంచి ఉప్పును తయారు చేయడం మొదలు పెట్టారు. ఇది ప్రాచీన కాలం నుంచి మన ఆహారంలో భాగంగా ఉంది.
* ఆయుర్వేదం ప్రకారం పింక్ సాల్ట్ జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి ఉపయోగపడుతుంది. గట్ హెల్త్, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్‌తో పోరాడేందుకు, డయేరియా నియంత్రణకు పింక్ సాల్ట్ అద్బుతంగా పనిచేస్తుంది. సాధారణ ఉప్పుతో పోలిస్తే పింక్ సాల్ట్ చాలా రెట్లు మెరుగైంది. సాధారణ ఉప్పును అతిగా తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్, స్ట్రోక్, గుండె సంబంధ సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే.. సాధారణ ఉప్పుకు ప్రత్యామ్నాయంగా ఈ పింక్​ సాల్ట్​ని ఉపయోగించడం మంచిదంటున్నారు నిపుణులు.
* పింక్ సాల్ట్ చర్మ ఆరోగ్యాన్ని కాపాడేందుకు దోహదపడుతుంది. తామర వంటి వివిధ చర్మ పరిస్థితుల నుంచి ఈ ఉప్పు ఉపశమనం కలిగిస్తుంది. తామరతో బాధపడేవారు ఈ ఉప్పును నీటిలో కలిపి స్నానం చేస్తే మంట నుంచి ఉపశమనం లభిస్తుందని నేషనల్ ఎగ్జిమా అసోషియేషన్ సూచించింది. పింక్ సాల్ట్‌ను సాధారణ దగ్గు, జలుబు, కంటి దృష్టి, జీర్ణక్రియ మెరుగుపర్చేందుకు ఉపయోగపడుతుంది. శ్వాసకోస సంబంధ సమస్యలను తగ్గించే సాల్ట్​ థెరపీలోనూ పింక్​ సాల్ట్​ని వాడతారు.