ఓం మంత్రం జ‌పించ‌డం వ‌ల్ల లాభాలేంటో తెలుసా?

Spiritual: ఓం…. (om) ఈ శ‌బ్దం వింటే మ‌న‌సుకు ఏదో తెలీని ప్ర‌శాంత‌త క‌లుగుతుంది. ఈ బ్ర‌హ్మాండంలో వినిపించిన మొద‌టి శ‌బ్దం ఓం అని చెప్తుంటారు.

*ఓం మంత్రం జ‌పించ‌డం అనేది అంద‌రి వ‌ల్ల కాదు. ఈ మంత్రం జ‌పించేందుకు స‌రైన ఏకాగ్ర‌త ఉండాలి. మ‌న‌సు దానిపైనే నిమ‌గ్నం అయ్యి ఉండాలి.

*ఓం మంత్రం జ‌పించ‌డం వ‌ల్ల మాన‌సిక దృఢ‌త్వం పెరుగుతుంది. ఏ విష‌యాన్ని అయినా ఫోక‌స్‌గా ఆలోచించ‌గ‌లుగుతాం.

*స‌రైన నిర్ణ‌యాలు తీసుకోగ‌లుగుతాం.

*మ‌న మెద‌డులో క్ష‌ణానికి వంద ఆలోచ‌న‌లు వ‌స్తాయి. నిరంత‌రం ఆలోచ‌న‌ల‌తో మెద‌డు కొట్టుమిట్టాడుతుంటుంది. ఈ ఓం మంత్రం జ‌పించ‌డం అల‌వాటు చేసుకుంటే ఓవ‌ర్ థింకింగ్‌ని దూరం చేస్తుంది. అవ‌స‌రం అయిన విష‌యాల‌పైనే మ‌నసు ఏకాగ్ర‌త‌తో ఉంటుంది.

*ఒత్తిడి తగ్గుతుంది. మ‌న‌సు ప్ర‌శాంతంగా ఉంటుంది.

*ఏద‌న్నా విష‌యం మ‌న‌కు న‌చ్చ‌క‌పోతే విప‌రీత‌మైన కోపం వ‌స్తుంది. అప్పుడు ఓం మంత్రం జ‌పించ‌డం వ‌ల్ల శాంతిస్తారు.