Spiritual: ఇంట్లో ఉండాల్సిన ముఖ్య‌మైన దేవుడి ఫోటోలు

Spiritual: చాలా మంది ఇళ్ల‌ల్లో దేవుడి ఫోటోలు, విగ్ర‌హాలు ఉంటాయి. కొంద‌రి ఇళ్ల‌ల్లో అయితే భారీగా మందిరాల‌ను నిర్మించుకుని మ‌రీ ఫోటోలు, విగ్ర‌హాలు పెట్టుకుంటారు. అయితే మ‌న ఇంట్లో ఉంచుకోవాల్సిన అతి ముఖ్య‌మైన దేవుడి ఫోటోల గురించి ఈరోజు మ‌నం తెలుసుకుందాం. ఆ ఫోటోల‌ను ఇంట్లో ఉంచుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేయండి. ఒక‌వేళ మీ ఇంట్లో ఇవి ఉంటే స‌రే. లేక‌పోతే తెచ్చి పెట్టుకోండి. దీని వ‌ల్ల ల‌క్ష్మీ అనుగ్ర‌హం, భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య అన్యోన్య‌త క‌ల‌గ‌డానికి చ‌క్క‌టి అవ‌కాశం ఉంటుంది.

మ‌న ఇంట్లో ఉండాల్సిన దేవుడి ఫోటోల‌లో అతి ముఖ్య‌మైన ఫోటో శ్రీరామ ప‌ట్టాభిజషేకం. ఈ ఫోటో క‌చ్చితంగా ఇంట్లో ఉంచుకోవాల్సిందేన‌ట‌. సీతారాములు, భ‌ర‌తుడు, ల‌క్ష్మ‌ణుడు, శ‌తృఘ్నుడు, ఆంజ‌నేయ‌స్వామి.. ఇలా మొత్తం ప‌ట్టాభిషేకం మొత్తంలో ఉన్న దేవత‌లు, బుషుల‌ అనుగ్ర‌హం ఇంటికి క‌లుగుతుంది. శ్రీరామ ప‌ట్టాభిషేకం ఫోటో ఏ ఇంట్లో అయితే ఉంటుందో.. ఏ ఇంట్లో అయితే ప్ర‌తి రోజూ శ్రీరామ ప‌ట్టాభిషేకం ఫోటోకి ఒక పువ్వు, అగ‌ర‌బ‌త్తి వెలిగిస్తారో ఆ ఇంట్లో సీతారాముల అనుగ్ర‌హం దండిగా ఉంటుంది. ఆ ఇల్లు చ‌ల్ల‌గా ఉంటుంది. మ‌న ఇంట్లో ఉండాల్సిన దేవుడి ఫోటోల్లో రెండో ముఖ్య‌మైన ఫోటో అర్థ‌నారీశ్వ‌రుల‌ ఫోటో. (Spiritual)

ఒక‌వేళ మీ ఇంట్లో అర్థ‌నారీశ్వ‌రుల ఫోటో ఉన్న‌ట్లైతే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆ ఫోటోను ప‌క్క‌కు తీసి పెట్ట‌కండి. చాలా మంది అర్థ‌నారీశ్వ‌రుల ఫోటో ఇంట్లో ఉండ‌కూడ‌దు అంటారు కానీ అది చాలా త‌ప్పు. ప్ర‌తి ఇంట్లోనూ అర్థ‌నారీశ్వరుల చిత్ర‌ప‌టం ఉండాలి. అది ఉండ‌టం వ‌ల్ల ఆ ఇంట్లో భార్యాభ‌ర్త‌ల‌కు అన్యోన్య‌త, ఒక‌రి ప‌ట్ల ఒక‌రికి అనురాగం క‌లుగుతాయి. అందుకే అర్థ‌నారీశ్వ‌రుల ఫోటో ఇంట్లో ఉంటే చక్క‌గా ప్ర‌తి రోజూ ఆ ఫోటోలో శివుడు ఉన్న వైపు ఒక తెలుపు రంగు పుష్పం, అమ్మ‌వారు ఉన్న వైపు ఒక ఎరుపు రంగు పుష్పం పెట్టండి. ఒక అగ‌రుబ‌త్తి చూపించండి. ఇలా చేస్తే భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య అన్యోన్య‌త పెరుగుతుంది.

ALSO READ: Ganga శివ‌య్య భార్య‌గా ఎలా మారింది? స‌ర‌స్వ‌తి శాపం వ‌ల్లేనా?

ఇక ప్ర‌తీ ఇంట్లో ఉండాల్సిన అతి ముఖ్య‌మైన మూడో ఫోటో.. పంచ‌ముఖ ఆంజ‌నేయ‌స్వామి. ఇంటికి వ‌చ్చే గ్ర‌హ దోషాలు, గ్ర‌హ పీడ‌లు, గ్ర‌హ బాధ‌లు న‌ర‌దృష్టి, న‌ర‌ఘోష‌, న‌ర‌పీడ‌, న‌ర‌శాపం.. ఇవ‌న్నీ తొల‌గిపోతాయి. ఐదు ముఖాలు క‌లిగిన ఆంజ‌నేయ స్వామి ఫోటో క‌చ్చితంగా ఇంట్లో ఉండి తీరాల్సిందే. ఆ ఫోటోకి ప్ర‌తి రోజూ ఎరుపు రంగు పుష్పం పెట్టి ధూపం వేస్తుంటే క‌చ్చితంగా గ్ర‌హ పీడ‌లు, గ్ర‌హ బాధ‌ల ఇత‌ర‌త్రా స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. ఇక నాలుగో ముఖ్య‌మైన ఫోటో ఏంటంటే.. ల‌క్ష్మీ నారాయ‌ణుల ఫోటో. ల‌క్ష్మీదేవి, నారాయ‌ణుడు క‌లిసి ఉన్న ఫోటో కానీ లేదా వెంక‌టేశ్వ‌ర స్వామి వారి హృద‌యంలో ల‌క్ష్మీదేవి ఉన్న ఫోటో కానీ ఇంట్లో ఉండాలి. దీంతో పాటు ల‌క్ష్మీ దేవి.. స‌రోవ‌రంలో ప‌ద్మంలో కూర్చుని అభ‌య హ‌స్తంతో ఉన్న ఫోటో ఇంట్లో ఉంటే చాలా మంచిది.

ఆ అమ్మ‌వారు కూర్చుని ఉన్న‌ప్పుడు వెన‌క ఐరావ‌తాలు బంగారు క‌ల‌శాల‌తో అమ్మ‌వారికి స్నానం చేయిస్తున్న‌ట్లు ఉన్న ఫోటోను ఇంట్లో పెట్టుకుని ప్ర‌తి రోజూ కుంకుమ పూజ చేస్తే ల‌క్ష్మీ దేవి అనుగ్రహం క‌చ్చితంగా క‌లుగుతుంది. ఇక ఇంట్లో ఉండాల్సిన మ‌రో ముఖ్య‌మైన ఫోటో ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి. ఉగ్ర న‌రసింహ స్వామి ఫోటో కాకుండా ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి ఉన్న ఫోటో మంచిది. ప్ర‌తి రోజూ సాయంత్రం పూట ఆయ‌న‌కు సాంబ్రాణి ధూపం వేస్తూ ఉంటే శ‌త్రుపీడ‌ను తీసేస్తాడు. మీరు ఎక్క‌డికి వెళ్లినా కూడా చ‌క్క‌టి అనుగ్ర‌హం క‌లిగే విధంగా ఆయ‌న అనుగ్ర‌హిస్తారు.