మీ పూర్వీకులు మీ ప‌ట్ల సంతోషంగా ఉన్నార‌ని ఎలా తెలుస్తుంది?

ప్ర‌స్తుతం మ‌హాల‌య ప‌క్షాలు  న‌డుస్తున్నాయి. దీనినే పితృ ప‌క్షం (pitru paksha) అని కూడా అంటారు. 29 సెప్టెంబ‌ర్‌న మొద‌లైన మ‌హాల‌య ప‌క్షాలు అక్టోబ‌ర్ 14 వ‌ర‌కు ఉంటాయి. ఈ స‌మ‌యంలో చ‌నిపోయిన‌ పూర్వీకుల‌కు పిండం పెట్ట‌డం, వారి స్మ‌ర‌ణ‌లో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించ‌డం వంటివి చేస్తుంటారు. ఇలా చేస్తే వారి ఆశీర్వాదాలు ఆ కుటుంబంపై ఎప్ప‌టికీ ఉంటాయ‌ని న‌మ్ముతారు. అయితే పూర్వీకులు మ‌న ప‌ట్ల సంతోషంగా ఉన్నార‌ని మ‌న‌కు తెలియ‌జేయ‌డానికి కొన్ని హింట్స్ ఇస్తుంటార‌ట‌. అవేంటో తెలుసుకుందాం.

క‌ల‌లో సింహం, పాములు, చిరుత‌

ఒక‌వేళ మీకు క‌ల‌లో అదే పనిగా సింహం, పాములు, చిరుత మీపై దాడి చేస్తున్న‌ట్లు వెంబడిస్తున్న‌ట్లు కాకుండా మామూలుగా క‌నిపిస్తుంటే మీ ప‌ట్ల మీ పూర్వీకులు సంతోషంగా ఉన్నార‌ని అర్థం. వారు మీరు చేసే ప‌నుల‌ను ప‌క్క‌నే ఉండి వీక్షిస్తూ మిమ్మ‌ల్ని కాపాడుతున్నార‌ని అర్థం. (pitru paksha)

పూజ స‌మ‌యంలో వ‌ర్షం

మీరు మీ పూర్వీకుల‌కు శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించేందుకు పూజా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న‌ప్పుడు వ‌ర్షం ప‌డినా కూడా వారు మీ ప‌ట్ల సంతోషంగా ఉన్నార‌ని అర్థంచేసుకోవాల‌ట‌. వ‌ర్ష‌పు చినుకుల‌ను పై నుంచి వారు కురిపిస్తున్న ఆశీర్వాదాలుగా భావిస్తుంటారు.

స‌మ‌స్య‌లను వారితో చెప్పుకోండి

ఈ లోకంలో లేని మ‌న పూర్వీకులు కూడా మ‌న‌కు దైవంతో స‌మాన‌మ‌నే అంటారు. మీకు భ‌రించ‌లేని స‌మ‌స్య‌లు ఉంటే న‌న్ను ర‌క్షించు అని మీ పూర్వీకుల ఫోటోల ముందు నిల‌బ‌డి ప్రార్ధించండి. ఏదో ఒక రూపంలో మీకు తోడుగా నిలిచి క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కేందుకు ఓ దారి చూపుతారు. (pitru paksha)

ఒక్క‌సారిగా డ‌బ్బు

గ‌రుడ పురాణం ప్ర‌కారం.. ఒక్క‌సారిగా డ‌బ్బు బాగా వ‌చ్చిన‌ట్లైతే కూడా పూర్వీకులు ఆశీర్వాద‌మ‌ని అర్థం. ఎప్పుడూ కూడా ఆర్థిక స‌మ‌స్య‌లు లేకుండా మంచి ఉద్యోగం సంతోషం ఉన్న‌ట్లైతే.. పూర్వీకులు ఆనందంగా ఉన్నార‌ని వారి దీవెన‌ల వ‌ల్లే ఇవ‌న్నీ కుదిరాయ‌ని అర్థంచేసుకోవాలి.