Ratha Saptami: సూర్య భ‌గ‌వానుడిని ఏ రాశుల వారు ఎలా పూజించాలి?

Ratha Saptami: నేడు ర‌థ స‌ప్త‌మి. ఈరోజు సూర్య భ‌గ‌వానుడి ఆల‌యానికి వెళ్లి ద‌ర్శ‌నం చేసుకుంటే ఎంతో మంచిది. సూర్య భ‌గ‌వానుడి మంత్రాలు, పాట‌ల‌తో ఉప‌వాసం చేసినా ఎంతో పుణ్యం. అయితే వివిధ రాశుల వారికి సూర్య భ‌గ‌వానుడి ప్ర‌భావం వివిధ ర‌కాలుగా ఉంటుంది. అలాంటప్పుడు ఏ రాశుల వారు సూర్యుడిని ఎలా పూజించాలో తెలుసుకుందాం. (Ratha Saptami)

మేషం (Aries)

మేష రాశి వారు ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉంటారు. రోజూ వీరు సూర్య న‌మ‌స్కారాలు చేస్తూ ఉంటే ఎంతో మంచిది. సంధ్యా వ‌ద‌నం చేసేవారు రోజూ ఎర్ర‌టి పూల‌ను సూర్యుడిని అర్పిస్తే ఎంతో మంచిది.

వృష‌భం (Taurus)

వృష‌భ రాశి వారు ఈరోజు సూర్య భ‌గ‌వానుడికి నిమ్మ జాతి పండ్ల‌ను నైవేద్యంగా పెడితే ఎంతో మంచిది. గాయ‌త్రి మంత్రం కానీ ఇత‌ర సూర్య మంత్రాలు కానీ జ‌పిస్తే శుభం క‌లుగుతుంది.

మిథునం (Gemini)

ఈరోజు మిథున రాశి వారు ధ్యానం లేదా మౌన వ్ర‌తం ద్వారా సూర్యుడిని ఆరాధించ‌వ‌చ్చు. సూర్య మంత్రాలను మ‌దిలో స్మ‌రించుకుంటూ ప‌సుపు రంగు పువ్వుల‌తో పూజిస్తే ఎంతో మంచిది.

క‌ర్కాట‌కం (Cancer)

క‌ర్కాట‌క రాశి వారు కాసేపు సూర్య కిర‌ణాలు త‌గిలేలా కూర్చుని ధ్యానం చేసుకోవాలి. 12 సూర్య మంత్రాలు చదువుకుంటే శుభం క‌లుగుతుంది.

సింహం (Leo)

సింహ రాశికి అధిప‌తి సూర్యుడు. బంగారు, నారింజ రంగుల వ‌స్త్రాన్ని సూర్య భ‌గవానుడికి స‌మ‌ర్పించి నెయ్యితో దీపం వెలిగించి ఆదిత్య హృద‌యం చ‌దువుకుంటే మంచిది.

క‌న్య‌ (Virgo)

క‌న్యా రాశి వారు ఉద‌యాన్నే సూర్యుడిని స్మ‌రిస్తూ నీరు వ‌ద‌లాలి. ధాన్యాలు, బెల్లం నైవేద్యంగా పెట్టి సూర్యాష్ట‌కం చ‌దివితే ఎంతో మంచిది.

తుల‌ (Libra)

తుల రాశి వారు సూర్యుడికి తెల్ల పువ్వుల‌ను పెట్టి ఆదిత్య హృద‌యం చ‌దువుకుంటే అంతా శుభ‌మే క‌లుగుతుంది.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారు ముందు సంధ్యావ‌ద‌నం చేసి ఆ త‌ర్వాత సూర్య భ‌గ‌వానుడి బొమ్మ లేదా ఫోటో ఉంటే ఎర్ర‌టి చంద‌నం పూసి సూర్య క‌వ‌చం చ‌దువుకోవాలి.

ధ‌నుస్సు (Sagittarius)

ధ‌నుస్సు రాశి వారు ఏదైనా సూర్య భ‌గ‌వానుడి ఆల‌యానికి వెళ్లి అర్చ‌న చేయించుకుంటే మంచిది. ప‌సుపు రంగు పండ్ల‌ను స‌మ‌ర్పించి సూర్య గాయత్రి మంత్రం జ‌పించాలి.

మ‌క‌రం (Capricorn)

సూర్య మంత్రాలు జ‌పిస్తూ నీరు వ‌దలాలి. ఆ త‌ర్వాత ఎర్ర‌టి పువ్వుల‌తో పూజిస్తూ గాయ‌త్రి మంత్రాన్ని జ‌పించాలి. బ్రాహ్మ‌ణుల‌కు ధాన్యాలు దానం చేస్తే ఎంతో మంచిది.

కుంభం (Aquarius)

నీళ్ల‌ల్లో కాస్త బెల్లం క‌లిపి ఆ నీళ్ల‌ను సూర్యుడికి స‌మ‌ర్పించాలి. ప్రొద్దుతిరుగుడు విత్త‌నాల‌ను దానం చేస్తే మంచిది.

మీనం (Pisces)

మీన రాశి వారు సూర్య భ‌గ‌వానుడికి తామ‌ర పువ్వుల‌ను స‌మ‌ర్పించి సూర్య స‌హస్ర‌నామం చ‌దివితే శుభం క‌లుగుతుంది.