Spiritual: డ‌బ్బు మీ జీవితంలోకి ప్ర‌వ‌హించాలంటే..

Spiritual: ఓ పెద్దాయ‌న చెప్పిన‌ట్లు డ‌బ్బులు ఎవ్వ‌రికీ ఊరికే రావు. దానికి ఎంతో క‌ష్ట‌ప‌డాలి. అఫ్‌కోర్స్.. క‌ష్ట‌ప‌డ‌కుండా కూడా కొంద‌రికి అలా డ‌బ్బులు వ‌చ్చి ప‌డుతూ ఉంటాయ‌నుకోండి. కానీ మ‌న‌లాంటి వారికి క‌ష్ట‌ప‌డితే కానీ రావు క‌దా..! మ‌రి ఆ డ‌బ్బు మ‌న జీవితంలోకి న‌దిలా ప్ర‌వ‌హిస్తూ రావాలంటే ఏం చేయాలి?

గుమ్మ‌డికాయ అంత టాలెంట్ ఉన్నా ఆవ‌గింజ అంత అదృష్టం ఉండాలి అంటారు పెద్ద‌లు. ఇక్క‌డ అదృష్టం అంటే దేవుడి ఆశీర్వాదం, యూనివ‌ర్స్ స‌హ‌కారం. ఇప్పుడు మ‌నం మానిఫెస్టేష‌న్ గురించి మాట్లాడుకుంటున్నాం. మానిఫెస్టేష‌న్ అంటే మ‌న‌కు కావాల్సిన దాని కోసం నిరంత‌రం త‌పిస్తూ ఈ యూనివ‌ర్స్‌తో మ‌న కోరిక‌ల‌ను బ‌లంగా చెప్పుకోవ‌డం. మ‌నం దేనినైనా బ‌లంగా కోరుకుంటే అది యూనివ‌ర్స్ మ‌న‌కు ఇస్తుంది అంటారు.

డ‌బ్బుని ఎలా మానిఫెస్ట్ చేసుకోవాలి?

సింపుల్. అంతా మీరు ఆలోచించే విధానంలో ఉంటుంది. త్వ‌ర‌లోనే మ‌నం సంప‌న్నులం కాబోతున్నాం.. డ‌బ్బు మ‌న‌ల్నే వెతుక్కుంటూ వ‌స్తుంది అని మ‌న‌లో మ‌నం అనుకుంటూ ఉండాలి. అనుకోవ‌డం అంటే ఏదో ఊరికే అలా అనేసుకోవ‌డం కాదు. మ‌న‌సు, మెద‌డు రెండూ కూడా దానిపైనే నిమగ్నం అయ్యి ఉండాలి. ఇలా మానిఫెస్ట్ చేసుకోవ‌డంతో పాటు కొన్ని చిట్కాలు కూడా పాటించాలి. ఉదాహ‌ర‌ణ‌కు మీరు డ‌బ్బు పెట్టుకునే వాలెట్ శుభ్రంగా ఉండేలా చూసుకోండి. డ‌బ్బు అంటే ల‌క్ష్మీదేవి. మ‌రి ల‌క్ష్మీదేవిని భ‌ద్ర‌ప‌రిచే స్థానాన్ని అశుభ్రంగా ఉంచుతామా? మీరు ఉద‌యం లేచిన‌ప్ప‌టి నుంచి చేసే పని మిమ్మ‌ల్ని సంప‌న్నులుగా చేసే వాటికి సంబంధించి ఉండాలి.

ఒక‌రి వ‌ద్ద‌కు డ‌బ్బు చేరాలంటే ఒక డైరెక్ష‌న్ ఉండాలి. మీ ద‌గ్గ‌ర డ‌బ్బు ఉంటే దానిని ఎంత జాగ్ర‌త్త‌గా ఏ అవ‌సరానికి వినియోగిస్తారో క్లారిటీ ఉండాలి. ఉదయం లేవ‌గానే నెగిటివ్ అంశాలను మాత్ర‌మే వాగే వారికి దూరంగా ఉండండి. వారితో మ‌న‌కు పైసా ఉప‌యోగం ఉండ‌దు. పైగా మ‌నం పాజిటివ్‌గా ఉన్నా కూడా ఏదో ఒక‌టి చెప్పి మూడ్ పాడుచేస్తారు. ఈ మానిఫెస్టేష‌న్ ప్రక్రియ‌లో కృతజ్ఞ‌తా భావం ఎంతో కీల‌కం. మీరు ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఛీ ఇదేం బ‌తుకురా బాబూ అనుకోవ‌ద్దు. బాధ ఉంటుంది నిజమే. కానీ జీవితాన్ని అస‌హ్యించుకోకండి. క‌నీసం ఇలా అయినా ఉన్నాను అది చాలు అనుకునే కృత‌జ్ఞ‌తా భావం అనేది ఉంటేనే ఈ మానిఫెస్టేష‌న్ ప్ర‌క్రియ ప‌నిచేస్తుంది.

చివ‌ర‌గా.. ఈ మానిఫెస్టేష‌న్ ప్ర‌క్రియ గురించి ఒక‌టి బాగా గుర్తుపెట్టుకోండి. మ‌నం ఏమీ చేయ‌కుండా మానిఫెస్టేష‌న్ ప‌నిచేస్తుంది అనుకుంటే పొర‌పాటే. మానిఫెస్టేష‌న్ అనేది మ‌నం సంప‌న్నులం అయ్యేలా ఒక దారి మాత్ర‌మే చూపుతుంది అని గుర్తుంచుకోవాలి.