Horoscope Today: ఈ రాశివారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి
Horoscope Today: ఈరోజు (March 16 2023) 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం.
మేషం (Aries)
విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అధికారులతో చర్చలు ఫలించవు. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. ఇంట్లో బయటా గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
వృషభం (Taurus)
ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలిసి వస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్ధిక ఇబ్బందులు తప్పవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ప్రోత్సాహకాలు ఉంటాయి.
మిథునం (Gemini)
ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆర్ధిక ఇబ్బందుల వల్ల కొత్త రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు కలిసిరావు. ఉద్యోగస్తులకు అదనపు పని భారం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
కర్కాటకం (Cancer)
చేపట్టిన పనులలో కార్య సిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాల్లో సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యలతో పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. బంధు, మిత్రులతో కుటుంబంలో సంతోషంగా గడుపుతారు.
సింహం (Leo)
బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. నూతన వ్యాపార విస్తరణ పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్ధిక లావాదేవీలు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారంలో నిరుత్సాహం తప్పదు. కొన్ని పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.
కన్య (Virgo)
వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలు వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
తుల (Libra)
కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. స్నేహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు వస్తాయి. చిన్న నాటి స్నేహితులను కలుసుకుంటారు.
వృశ్చికం (Scorpio)
దైవచింతన పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. సోదరులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొంత చికాకుగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
ధనుస్సు (Saggitarius)
మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆలయాలు సందర్శించుకుంటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి, ఉద్యోగస్తుల పని ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యంలో శ్రద్ధ అవసరం.
మకరం (Capricorn)
ఆప్తుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభ నలుగురికీ తెలుస్తుంది. సంతాన విషయమై ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.
కుంభం (Aquarius)
సన్నిహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖ సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది.
మీనం (Pisces)
కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. నూతన ప్రయత్నాలు కలిసి రావు. ఆకస్మిక ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు కలిసి రావు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాల్లో ఊహించని ఇబ్బందులు ఉన్నాయి.